ఏపీలో ఓ వ్యక్తి అతి తెలివి.. ఏకంగా 155 మద్యం షాపులకు దరఖాస్తు, ఒక్కడే ఎంత ఖర్చు చేశారో తెలుసా!

ఏపీలో మద్యం షాపుల లైసెన్సుల కోసం లాటరీ జరుగుతోంది. విశాఖపట్నంలో ఓ వ్యక్తి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అతి తెలివితో 155 మద్యం షాప్‌లకు గాను 155 షాపులకు దరఖాస్తు చేశారు. ఇప్పటి వరకు⁠ 23 షాపులకు లాటరీ పూర్తికాగా.. ఒక్క షాపు కూడా రాలేదు. ఆయన తనను అదృష్టం ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఒక్క షాపైనా తనకు రాకపోదా అని ఎదురు చూస్తున్నారు. అంటే ఒక్కో షాపుకు రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.3 కోట్ల 10 లక్షలతో దరఖాస్తు చేశారు ఆ వ్యక్తి.

మరోవైపు రాష్ట్రంలో మద్యం షాపులకు లాటరీలు కొనసాగుతున్నాయి. 26 జిల్లాల పరిధిలో ఇవాళ ఉదయం 8 గంటల నుంచే కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతోంది. జిల్లా గెజిట్‌లో ప్రచురించిన షాపుల క్రమసంఖ్య ప్రకారం లాటరీ తీస్తున్నారు అధికారులు.. అక్కడ సందడి వాతావరణం కనిపిస్తోంది. ముందస్తు జాగ్రత్తగా లాటరీ కేంద్రాల దగ్గర పోలీసులు ఆంక్షలు విధించారు. 100 మీటర్ల పరిధిలోనే వాహనాల రాకపోకలను నిలిపేస్తున్నారు.. దరఖాస్తు చేసుకున్న వారు కాలినడన మద్యం లాటరీ కేంద్రాలకు అనుమతిస్తున్నారు. అక్కడ లాటరీలో షాపు దక్కిన వారి ఆనందంలో ఉంటే.. షాపు రానివారు నిరుత్సాహంగా ఉన్నారు. కొన్ని చోట్ల లాటరీ దక్కిన వారితో సిండికేట్ అయ్యేందుకు కొంతమంది బేరాలు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 3,396 మద్యం షాపులకు 89,882 దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే.. నాన్‌ రిఫండబుల్‌ రుసుముల రూపంలో ప్రభుత్వానికి రూ.1,797.64 కోట్ల మేర ఆదాయం వచ్చింది.

About amaravatinews

Check Also

వైసీపీ సంచలన నిర్ణయం.. పీఏసీ ఛైర్మన్ పదవికి నామినేషన్, మాజీ మంత్రికి ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామం జరిగింది. ఇవాళ శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, అండర్ టేకింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *