భూకంపం ధాటికి వణికిపోయిన మేడారంలోని సమ్మక్క-సారలమ్మ గద్దె..!

ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం నమోదవ్వడంతో.. ఏజెన్సీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ములుగు జిల్లాలో వరుసగా ప్రకృతి వైపరిత్యాలు బయటకు వస్తున్నాయి. ఇటీవల ములుగు జిల్లాలో ఈదురుగాలుల బీభత్సం సృష్టించాయి. దాదాపు 50వేలకు పైగా చెట్లు నేల కూలాయి. వరదల సమయంలో పలు ఊర్లకు తెగిపోయిన సంబంధాలు తెగిపోయాయి. చాలా రోజుల పాటు ఇబ్బందుల పడ్డారు.

ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. తెలంగాణలో 20ఏళ్లలో తొలిసారి భారీగా ప్రకంపనలు వచ్చాయన్నారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలోనే పవిత్ర ఆధ్యాత్మక కేంద్రం మేడారంలోని సమ్మక్క-సారలమ్మ గద్దె వద్ద సైతం భూమి కంపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సిసి కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

కోల్‌బెల్ట్‌ దగ్గర ఇంత తీవ్రత రావడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. సింగరేణి కోల్‌ బెల్ట్‌కు దగ్గరగా భూకంప కేంద్రం ఉన్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు. దీంతో.. భద్రాద్రి జిల్లాలో ఎక్కువగా ప్రకంపనలు కనిపించాయి. ఇల్లందు, మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెంలో ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు. కోల్‌బెల్ట్‌ దగ్గర ఉండడంతో ప్రజల భయాందోళన చెందుతున్నారు.

భూ ప్రకంపనలకు కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జనం వణికిపోయారు. పలుచోట్ల ఇంటి గోడలు పడిపోయాయి. సిమెంట్ ఇటుకలతో కట్టిన గోడ కూలిపోయింది. 30 సెకన్లకు పైగా వచ్చిన భూకంప తీవ్రత సీసీ కెమెరాలో రికార్డు అయింది. మంచిర్యాల, చెన్నూర్ , జైపూర్ మండలాల్లో కంపించింది భూమి. వరంగల్‌ జిల్లాలో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *