ఆంధ్రప్రదేశ్ ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈ అల్పపీనడం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు…
ఆంధ్రప్రదేశ్ ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈ అల్పపీనడం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బికనేర్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడనుంది.
అలాగే కోస్తా నుంచి దక్షిణ మయన్మార్ వరకు ఉపరితల ఆవర్తన ఏర్పడనుందని అధికారులు అంటున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ మయన్మార్ పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని అధికారులు చెబుతున్నారు. దీని కారణంగా మూడు రోజుల పాటు కోస్తాలో చాలా చోట్ల తేలిక నుంచి మోస్తారు వర్షాలు.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
సోమవారం ఏపీలోని పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, తూర్పుగోదావరి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.