వర్షాల వేళ స్కూళ్లకు సెలవులు.. కలెక్టర్లకు మంత్రి కీలక ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మరో వారం రోజుల పాటు కూడా ఇలాగే కుండపోత వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రధానంగా వచ్చే నాలుగైదు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో.. పలు జిల్లాలకు ఎల్లో, రెడ్ అలర్టులను ప్రకటించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎస్ శాంతి కుమారి, జిల్లా కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం (ఆగస్టు 20న) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

Get AI PCs for businessAdvanced threat detection starts with IntelIntelరాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిస్థితి గురించి కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాల్లో చేపట్టవలసిన సహాయ చర్యల గురించి పలు ఆదేశాలు జారీ చేశారు.

వచ్చే నాలుగైదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. వర్ష సూచన, స్థానిక పరిస్థితులను బట్టి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే నిర్ణయాన్ని కలెక్టర్లే తీసుకోవాలని కీలక ఆదేశాలు ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. సోమవారం రాత్రి (ఆగస్టు 19) నుంచి మంగళవారం ఉదయం వరకు గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినపప్పటికీ.. వీలైనంతమట్టుకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవడం పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో మున్సిపల్, మెట్రో వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

మంగళవారం ఉదయం హైదరాబాద్ సహా కొన్ని జిల్లాల్లో ఎడతెగని కుండపోత వర్షం కురియగా.. పలు విద్యాసంస్థలు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలోనూ.. కుండపోత వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అయితే.. కొన్నిసార్లు ఉదయం పాఠశాల సమయం వరకు కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటంతో.. విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా కలెక్టర్లు.. ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులను బట్టి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని మంత్రి పొంగులేటి సూచించారు.

About amaravatinews

Check Also

రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు.. రాయితీపై ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు

తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో తీపి కబురు చెప్పింది. ఇప్పటికే రూ.2 లక్షల రైతు రుణ మాఫీ, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *