త్వరలోనే అన్ని గ్రామాలకు ఇంటర్నెట్.. 20 MB స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా.. మంత్రి తీపికబురు

తెలంగాణ వాసులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ వినిపించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే తెలంగాణలోని అన్ని గ్రామాలకు ఫైబర్‌ నెట్‌వర్క్‌ అందుబాటులోకి తీసుకొచ్చి ఇంటర్నెట్‌ కనెక్షన్ల సదుపాయం కల్పించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు కీలక ప్రకటన చేశారు. మంగళవారం (సెప్టెంబర్ 17న) రోజున కరీంనగర్‌లో ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న తర్వాత.. స్థానిక ఆర్‌ అండ్‌ బీ గెస్టు హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కీలక ప్రకటన చేశారు. తెలంగాణలోని అన్ని గ్రామాలకు ఫైబర్‌ నెట్‌వర్క్‌ని విస్తరించి 20 ఎంబీ ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ సదుపాయాన్ని అందించేందుకు ఐటీ శాఖ కృషి చేస్తోందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా సంగుపేట, నారాయణపేట జిల్లా మద్దూరు, పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్‌ గ్రామాలను ఫైలెట్‌ ప్రాజెక్టులుగా ఎంచుకున్నట్టు తెలిపారు. త్వరలోనే.. ఈ గ్రామాల్లో పూర్తి స్థాయిలో నెట్‌వర్క్‌ విస్తరించనున్నట్టు తెలిపారు. ఈ ఫైలెట్‌ గ్రామాల్లో ప్రధానంగా కేబుల్‌ టీవీ సర్వీస్‌, కేబుల్‌ వర్చువల్‌ డెస్క్‌టాప్‌ కనెక్టివిటీతో పాటు.. 20 ఎంబీ అన్‌లిమిటెట్‌ ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ, టెలిఫోన్‌ సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.

About amaravatinews

Check Also

నిరుద్యోగులకు భలే న్యూస్.. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎట్టకేలకు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎప్పుడాని ఊరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగాలకు మోక్షం కలిగిస్తూ ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *