రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు.. రాయితీపై ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు

తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో తీపి కబురు చెప్పింది. ఇప్పటికే రూ.2 లక్షల రైతు రుణ మాఫీ, వరికి రూ.500 బోనస్ ప్రకటించగా.. త్వరలో రాయితీపై ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు అందించేందుకు సిద్ధమైంది. యాసంగి సీజన్‌ నుంచి అన్నదాతలకు అవసరమైన వ్యవసాయ ఉపకరణాలు, యంత్రాలను రాయితీపై సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

జిల్లాల వారీగా రైతుల నుంచి ఉన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని వ్యవసాయ పనిముట్లు, యంత్ర పరికరాల జాబితా తయారు చేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. వ్యవసాయ పనిముట్లు, యంత్రాల తయారీ సంస్థల సహకారంతో అన్నదాతల్లో అవగాహన కల్పించేందుకు గాను జిల్లాల వారీగా ప్రదర్శనలు సైతం నిర్వహిస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా అన్నాదతలకు ట్రాక్టర్లు, నాగళ్లు, కల్టివేటర్లు, రోటోవేటర్లు, పవర్‌ వీడర్లు, తైవాన్‌ స్ర్పేయర్లు, మొక్కజొన్న ఒలిచే యంత్రాలు, కిసాన్‌ డ్రోన్లను ప్రతిపాదించినట్లు చెప్పారు.

గత ప్రభుత్వ హయంలో రైతులకు యంత్రాలు రాకపోవడంతో వ్యవసాయం చేసేందుకు వారికి ఇబ్బంది కలిగిందని విమర్శించారు. తాజాగా రైతుల్లో అవగాహన పెంపొందించడానికి గాను జిల్లాల వారీగా ప్రదర్శనలను ప్రభావవంతంగా నిర్వహించాలని వ్యవసాయశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. అన్నదాతలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సీజన్‌ ప్రారంభంలోనే వ్యవసాయ పనిముట్లను అందజేయాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలను సైతం ఈ ప్రదర్శనల్లో భాగస్వామ్యం చేయాలన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

About amaravatinews

Check Also

RGUKT: ‘నా ఫ్రెండ్స్ అందరూ అంత్యక్రియలకు రావాలి’.. కన్నీళ్లు పెట్టిస్తున్న బాసర విద్యార్థిని సూసైడ్ లెటర్..!

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ (RGUKT) ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతన్న స్వాతిప్రియ అనే స్టూడెంట్ సూసైడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *