శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు కలకలంరేపాయి. ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజాము 3.42 నిమిషాలకు భూమి స్వల్పంగా కంపించినట్లు కొందరు చెబుతున్నారు. ఒక్కసారిగా భూమి నుంచి పెద్ద శబ్దాలు వినిపించాయని.. అత్యల్పంగా భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. కొందరు భయంతో బయటకు పరుగులు తీశారు. నమాజ్ చేసేందుకు ఆ సమయంలో తాను లేచానని.. శబ్దాలు విని భయపడి బయటకు వచ్చానని ప్రత్యక్ష సాక్షి జోహార్ ఖాన్ అన్నారు. రెండేళ్ల క్రితం అక్టోబర్‌లో పలుమార్లు స్వల్ప ప్రకంపనలు వచ్చాయని.. వాటితో పోల్చితే నేడు వచ్చినవి అత్యల్పమని మరో స్థానికుడు నరసింహమూర్తి అన్నారు. ఈ భూ ప్రకంపనల వ్యవహారంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal