Ratan Tata: దిగ్గజ పారిశ్రామికవేత్త, బిజినెస్ టైకూన్ రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు దేశీయ ప్రముఖ పారిశ్రామికవేత్తలు విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం టాటా గ్రూప్‌కే కాదు, దేశ ప్రజలకు తీరని లోటన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ. రతన్ టాటాతా తనకు ఉన్న అనుబంధం, ఇద్దరూ కలిసి పంచుకున్న అనేక విషయాలు, ఆయన వ్యక్తిత్వం తనలోని స్ఫూర్తిని, తనకు శక్తినిచ్చాయన్నారు. రతన్ టాటా మూర్తీభవించిన మానవ విలువలు గల గౌరవప్రదతమైన వ్యక్తి అన్నారు. అంబానీ కుటుంబం తరపున టాటా గ్రూప్ సభ్యులకు, టాటా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
‘రతన్ టాటా దూరదృష్టిగల పారిశ్రామికవేత్త, పరోపకారి. ఆయన ఎప్పుడూ సమాజ శ్రేయస్సు కోసం పాటు పడిన వ్యక్తి. ఆయన మరణంతో భారత దేశం తన అత్యంత ప్రసిద్ధ, దయగల కుమారుల్లో ఒకరిని కోల్పోయింది. మిస్టర్ టాటా భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ప్రపంచంలోని అత్యుత్తమమైన వాటిని భారత్‌కు తీసుకువచ్చారు. 1991లో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి టాటా గ్రూపును 70 రెట్లు పెంచారు.’ అని ముకేశ్ అంబానీ తనకు రతన్ టాటాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.