Multibagger: స్మాల్ క్యాప్ కేటగిరి డిఫెన్స్ సెక్టార్ కంపెనీ అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ (Apollo Micro Systems Ltd) స్టాక్ అదరగొట్టింది. గత రెండేళ్లలో తమ షేర్ హోల్డర్లకు హైరిటర్న్స్ అందించింది. 2 ఏళ్లలోనే ఏకంగా 386 శాతం లాభాలు అందించింది. అలాగే గత నాలుగేళ్లలో చూసుకుంటే లక్ష రూపాయల పెట్టుబడిని 920 శాతం లాభంతో రూ.10 లక్షలకుపైగా చేసి మల్టీబ్యాగర్ స్టాక్‌గా నిలిచింది. ఇప్పుడు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రముఖ బ్రోకరేజీలు అంచనా వేస్తున్నాయి. మరి అపోలో మైక్రో సిస్టమ్స్ కంపెనీ స్టాక్ గురించి ఇప్పుడే మనం తెలుసుకుందాం.
రెండేళ్ల క్రితం రూ. 21 వద్ద ఉన్న ఈ కంపెనీ షేర్ ధర ఇప్పుడు రూ. 100 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను ఇటీవలే ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో రెవెన్యూ 84.38 శాతం వృద్ధితో రూ. 161 కోట్లు నమోదు చేసింది. కంపెనీ నికర లాభం రూ. 15.7 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీకి రూ. 7 కోట్ల లాభం వచ్చింది. ఇప్పుడు లాభం రెండింతలు పెరిగింది.
కంపెనీ స్టాక్ అవుట్ లుక్ గమనిస్తే.. ఈరోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్లో అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ షేరు 1.27 శాతం నష్టపోయి రూ. 100.81 వద్ద ట్రేడవుతోంది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 161.70 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ. 65.25 వద్ద ఉంది. గత వారం రోజుల్లో ఈ షేరు 7 శాతం పెరిగింది. గత నెల రోజుల్లో 2 శాతానికిపైగా నష్టపోయింది. గత ఆరు నెలల్లో ఈ షేరు 8 శాతం నష్టపోయింది. గత రెండేళ్లలో ఈ షేరు 386 శాతం లాభాలు ఇచ్చింది. లక్ష పెట్టుబడిని రూ. 4.86 లక్షలు చేసింది. గత ఐదేళ్ల కాలంలో 1177 శాతం లాభాన్ని ఇచ్చింది. లక్ష రూపాయలను రూ. 12.77 లక్షలకు పైగా చేసింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ. 3100 కోట్లుగా ఉంది.