ప్రసాదం బుట్టలో ఎలుకల వీడియోపై పూర్తి విచారణ జరుపుతామని సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఆలయ నిర్వాహకులు విచారణ జరిపి సరైన వివరణ ఇస్తారని ముంగంటివార్ పేర్కొన్నారు. ఈ వైరల్ ఫోటో, వీడియోపై కూడా దర్యాప్తు చేయనున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి వారు భక్తుల కొంగుబంగారం. శ్రీవారి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో వాడే నెయ్యి వివాదం ప్రపంచ వ్యాప్తంగా వెంకన్న భక్తుల్లో ఆగ్రహ జ్వాలలు రగిల్చింది. ఓ వైపు ప్రసాదం తయారీలో కల్తీపై చర్చలు కొనసాగుతున్న క్రమంలో ముంబైలోని ప్రముఖ సిద్ధివినాయక మందిరంలోని ప్రసాదం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. సిద్ధివినాయకుని ఆలయంలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సిద్ధివినాయకుని ఆలయంలో భక్తులకు పంపిణీ చేసే ప్రసాదం బుట్టల్లో ఎలుకలు విహరిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
సిద్ధివినాయక ఆలయంలోని ప్రసాదం బుట్టలో ఎలుకలు తిరుగుతున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆలయ పరిసరాల పరిశుభ్రతపై భక్తుల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే ఈ కథనంలో ఎలాంటి వాస్తవం లేదని సిద్ధివినాయక ఆలయ నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ వీడియో ఆలయం వెలుపలిది కావొచ్చని అధికారులు చెబుతున్నారు. ఆలయ పరిసరాల్లో ఎప్పుడూ పరిశుభ్రత ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రసాదం బుట్టలో ఎలుకల వీడియోపై పూర్తి విచారణ జరుపుతామని సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఆలయ నిర్వాహకులు విచారణ జరిపి సరైన వివరణ ఇస్తారని ముంగంటివార్ పేర్కొన్నారు. ఈ వైరల్ ఫోటో, వీడియోపై కూడా దర్యాప్తు చేయనున్నారు.