నెలకు రూ. 3 వేలు చాలు.. ఇలా చేతికి రూ. 34 లక్షలు.. వడ్డీ లేకుండానే రూ. 30 లక్షల లోన్!

SIP Calculator: స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు ఉంటంటాయి. ఇది మనం గమనిస్తూనే ఉన్నాం. ఇటీవలి కాలంలో సెన్సెక్స్ రోజుకు 1000, 2000 పాయింట్ల మధ్య కూడా హెచ్చుతగ్గులకు లోనవుతూ వస్తోంది. ఒక్కసారిగా పడిపోవడం.. మళీ 2-3 రోజుల్లోనే కోలుకోవడం చూస్తుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి పెద్ద మొత్తం లేదా షార్ట్ టర్మ్ పెట్టుబడులు పెట్టేవారికి ఇబ్బందికరమని చెప్పొచ్చు. ఇదే దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేసే వారికి మాత్రం ప్రయోజనం చేకూరుస్తుంది. ఇంకా మ్యూచువల్ ఫండ్లలో చూసినట్లయితే.. సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా ఇన్వెస్ట్ చేసే వారికి ఆందోళనే అవసరం ఉండదు. మార్కెట్ లాభనష్టాల్లో ఉన్నా.. మదుపు చేస్తూ వెళ్లడమే వీరికి కలిసొస్తుంది. అయితే సిప్ ఫలితాలు ఎలా ఉంటాయి.. మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి వివరాలు తెలుసుకుందాం.

సిప్ ద్వారా పెట్టుబడుల్ని ఏటా కొంత శాతం పెంచుకుంటూ పోతే మంచి ఫలితం పొందొచ్చు. పెద్ద మొత్తంలో సంపద కూడబెట్టొచ్చు. మీ ఆర్థిక లక్ష్యాలు ఏమున్నాయి.. ఎంత సమయంలో ఎంత కూడబెట్టాలనుకుంటున్నారు. ఇలా స్పష్టమైన అవగాహన సిప్ ప్రారంభించాలి. ఇప్పుడు మీ లక్ష్యాలు భవిష్యత్తులో మారిపోవచ్చు. చాలా మంది ఎన్నో పథకాల్లో మదుపు చేస్తున్నప్పటికీ వారి ఆర్థిక లక్ష్యాలు నెరవేరవు. భవిష్యత్తులో ఖర్చుల్ని సరిగ్గా అంచనా వేయకపోవడమే ఇందుకు కారణం.

సిప్‌లో కూడా రిస్క్ భరించగలిగే సామర్థ్యం, రాబడి అంచనాలు, వ్యవధి, ఆర్థిక లక్ష్యాలు ఎన్నో అంశాల్ని పరిశీలించి సరైన పథకం ఎంచుకోవాలి. రిస్క్ ఉన్నా మంచి రిటర్న్స్ కోసం దీర్ఘకాలిక వ్యవధికి ఈక్విటీ పథకాలు, తక్కువ రిస్క్ కోసం అయితే డెట్ ఫండ్స్ ఉపయోగపడతాయి. మధ్యస్థంగా నష్టభయం అంటే హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి.

స్వల్పకాలిక హెచ్చుతగ్గుల విషయంలో ఆందోళన పడొద్దు. మార్కెట్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాం అనే దాని కంటే ముందుగా.. ఎంత కాలం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది చూసుకోవాలి. లాంగ్ టర్మ్‌లో మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పొచ్చు.

మ్యూచువల్ ఫండ్లలో సిప్ విధానంలో మదుపు చేస్తే రూ. కోటి కూడబెట్టడం కూడా పెద్ద కష్టం కాదు. నెల నెలా నిర్దిష్ట మొత్తం పెట్టుబడి పెడుతూ.. దీర్ఘకాలం సాగితే ఇది సాధించొచ్చు. ఇక్కడ ఇంకా ముఖ్యంగా సిప్ మొత్తం ప్రతి ఏటా 10 శాతం పెంచుకుంటూ పోతూ.. 15 శాతం వార్షిక రాబడి అంచనా వేస్తే రూ. కోటికి మంచి కూడా సంపాదించేందుకు వీలుంటుంది. మార్కెట్ పరిస్థితులు బాగుంటే ఇంకా ఎక్కువ ఆర్జించొచ్చు.

హోం లోన్ వడ్డీ లేకుండానే..

సిప్ పెట్టుబడులతో హోం లోన్‌పై వడ్డీ కూడా లేకుండానే బెనిఫిట్ పొందొచ్చు. ఎలాగంటే.. మీరు హోం లోన్ తీసుకొని.. ఈఎంఐతో పాటుగా కొద్ది మొత్తం సిప్ చేస్తూ వెళ్తే వడ్డీ తిరిగి సంపాదించుకోవచ్చు. ఉదాహరణకు మీరు 20 ఏళ్ల వ్యవధికి 9 శాతం వడ్డీ రేటుకు రూ. 30 లక్షల లోన్ తీసుకున్నట్లయితే.. ఇంత కాలానికి మీ వడ్డీ రూ. 34,78027 అవుతుంది. దీనిని తిరిగి మీరు పొందాలంటే.. లోన్ మొత్తంలో 0.10 శాతం అంటే రూ. 3 వేలు ప్రతి నెలా సిప్ చేస్తూ వెళ్లాలి. ఇలా 20 ఏళ్లు చేస్తే.. మీ మొత్తం పెట్టుబడి రూ. 7 లక్షల వరకు ఉంటే.. ఇక్కడ వార్షికంగా 13 శాతం రాబడి లెక్కన చూసినా 20 సంవత్సరాల్లో చేతికి రూ. 34,36,557 అందుతుంది. మీరు లోన్‌పై చెల్లించిన వడ్డీ తిరిగి పొందినట్లవుతుంది.

ఇక్కడే మీరు రూ. 2500 చొప్పున సిప్ చేస్తే అది 23 ఏళ్లలో పొందొచ్చు. 5 వేల సిప్ చొప్పున అయితే మీ వడ్డీని 19 ఏళ్లలోనే పొందే అవకాశం ఉంటుంది. రూ. 10 వేల సిప్ అయితే 15 ఏళ్లు, రూ. 20 వేల సిప్ అయితే 11 సంవత్సరాలు, రూ. 30 వేల సిప్ అయితే పదేళ్లు పడుతుంది.

About amaravatinews

Check Also

Odisha: గిరిజన మహిళను కొట్టి.. బలవంతంగా మలాన్ని తినిపించి.. అమానుషం

ఓ గిరిజన మహిళపై దాడిచేసి.. ఆమెతో బలవంతంగా మానవ మలం తినిపించిన అత్యంత హేయమైన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. బొలన్‌గిర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *