ఏపీలో మద్యం షాపులు దక్కించుకున్నవారికి భారీ ఊరట.. ఈ నెలాఖరు వరకు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం షాపుల్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం షాపులకు సంబంధించి ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మద్యం షాపులకు సంబంధించి.. ఇటీవల జారీ చేసిన ప్రొవిజినల్‌ లైసెన్స్‌ల గడువును నెలాఖరు వరకు పొడిగిస్తూ ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. లైసెన్సీల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 31 వరకు ప్రొవిజినల్‌ లైసెన్స్‌లు కొనసాగుతాయి అని చెప్పారు.

రాష్ట్రంలో మద్యం షాపులు దక్కించుకున్న వారు.. ఆ వెంటనే నిబంధనల ప్రకారం వార్షిక లైసెన్సు రుసుములో ఆరో వంతు మొత్తాన్ని చెల్లించారు. షాపులు దక్కించుకున్నవారు ఈ మొత్తాన్ని చెల్లించడంతో తాత్కాలిక లైసెన్స్‌ జారీ చేశారు ఎక్సైజ్ అధికారులు. ఈ ప్రొవిజనల్ లైసెన్స్‌ల గడువు ఈనెల 22వ తేదీ వరకు అమలులో ఉంది. మద్యం షాపులను అద్దెకు తీసుకున్న తర్వాత రెండేళ్ల పాటు అమలులో ఉండే పూర్తి స్థాయి లైసెన్స్‌ జారీ చేస్తుంది ఎక్సైజ్‌శాఖ. అయితే ఈ నెల 22తో ప్రొవిజనల్ లైసెన్స్ గడువు ముగిసినా.. ఈ నెలాఖరు వరకు పొడిగించారు.

మరోవైపు రాష్ట్రంలో ఇటీవల మూతబడిన ప్రభుత్వ మద్యం షాపుల్లో ఉన్న ఫర్నీచర్‌ సహా ఇతర సామాగ్రికి సంబంధించి ప్రభుత్వ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఫర్నీచర్‌ను ఎక్సైజ్‌ పోలీసు స్టేషన్లు, ఆఫీసులలో వినియోగించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నడిపిన మద్యం షాపుల్లో ఉపయోగించిన కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇన్వర్టర్లు, ఇతర సామాగ్రిని ఎక్సైజ్‌ స్టేషన్లు, ఆ శాఖ డీసీ, ఏసీ, ఈఎస్‌ ఆఫీసులకు తరలిస్తున్నారు. ఫర్నీచర్‌‌ను తమకు కేటాయించాలని ఎక్సైజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ సంఘం ఎక్సైజ్‌ శాఖను కోరగాజ. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

About amaravatinews

Check Also

రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన మృత్యువు.. టిప్పర్ ఢీకొని ఏడుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్‌ ఢీకొట్టిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *