దేవర సాంగ్‌పై దారుణంగా.. సబ్బుల యాడ్‌లా ఉందంటూ ట్రోల్స్.. ఫ్యాన్స్ ఫైర్

జూ ఎన్టీఆర్ -జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ‘దేవర’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కాబోతుంది. దేవర పార్ట్ 1 ఈ ఏడాది సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫియర్ సాంగ్‌ను రిలీజ్ చేయగా అది సూపర్ హిట్ అయింది.

తాజాగా “చుట్టమల్లే” అంటూ ఓ రొమాంటిక్ సాంగ్‌ను నిన్న రిలీజ్ చేశారు. బీచ్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్టీఆర్-జాన్వీపై తీసిన ఈ సాంగ్ అదిరిపోయేలా ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్-జాన్వీ రొమాన్స్, కెమిస్ట్రీ వేరే లెవల్లో ఉంది. నందమూరి ఫ్యాన్స్ అయితే ఈ పాటను తెగ లైక్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఈ పాటను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇలా సాంగ్ రిలీజైందో లేదో అలా కొన్ని వందల అకౌంట్ల నుంచి ఈ పాటపై ట్రోల్స్ దర్శనమిచ్చాయి.

రేయ్ ఎవర్రా మీరంతా

“చుట్టమల్లే చుట్టేస్తాంది.. తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు.. అస్తమానం నీలోకమే నా మైమరపు.. చేతనైతే నువ్వే నన్నాపు..” అంటూ సాగే ఈ పాట మత్తెక్కించేలా ఉంది. ముఖ్యంగా రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ చాలా సింపుల్‌గా వినసొంపుగా ఉన్నాయి. అయితే ఈ పాట ట్యూన్ ఫేమస్ శ్రీలంక సాంగ్‌లా ఉందంటూ కొంతమంది నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అయితే మరికొంతమంది మాత్రం ఏకంగా ఈ పాట విజువల్స్‌పై కూడా దారుణంగా పోస్టులు చేస్తున్నారు.

నిజానికి పాట విజువల్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. కానీ కావాలని ట్రోల్ చేయడానికి ఈ పాట సబ్బుల యాడ్‌లా ఉందంటూ రెక్సోనా, సింథాల్, లిరిల్ సోప్ యాడ్స్‌తో మిక్స్ చేసి వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు. ఇవి చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ పోస్టులు చేస్తున్న వారిని ఏకిపారేస్తున్నారు. ఇప్పటికే ఈ పాట యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధించింది. అందుకే కావాలని ఈ పాటను ట్రోల్ చేస్తున్నారంటూ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఇలా దారుణమైన ట్రోల్స్ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ను కోరుతున్నారు అభిమానులు.

అయినా నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ ఇలా సినిమాను కిల్ చేసే విధంగా ట్రోల్స్ చేయడం దారుణం. ఇలాంటి పోస్టులు పెడుతున్నవారిపై మూవీ టీమ్ చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. మొత్తానికి ముందే చెప్పినట్లుగా ఓ మంచి రొమాంటిక్ మెలొడీని అయితే దేవర టీమ్ అందించింది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. శ్రీకాంత్ సహా స్టార్ క్యాస్టింగ్ ఈ చిత్రంలో ఉంది.

About amaravatinews

Check Also

అల్లు అర్జున్ బౌన్సర్ అరెస్ట్‌.. ఆంటోనితో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌..

సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తొక్కిసలాటకు సంబంధించి అసలు సూత్రధారిగా భావిస్తున్న అల్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *