Share Buyback: ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న మదుపరులకు బిగ్ అలర్ట్. అక్టోబర్ 1, 2024 నుంచి కీలక మార్పులు జరగనున్నాయి. కొత్త బైబ్యాక్ ట్యాక్స్ రూల్స్ అమలులోకి వస్తున్నాయి. దీంతో ఆదాయపు పన్ను చెల్లింపులు కంపెనీల నుంచి షేర్ హోల్డర్లకు తర్జుమా కానుంది. షేర్ల బైబ్యాక్ (Buy Back) చేసినప్పుడు ఇన్నాళ్లు కంపెనీలు ట్యాక్స్ కడుతుండగా.. ఇప్పుడు ఆ ట్యాక్స్ షేర్ హోల్డర్లు కట్టాల్సి ఉంటుంది. ఇది మూలధన పంపిణీ, పెట్టుబడి వ్యూహాల కోసం కంపెనీలు అనుసరించే విధానాన్ని ప్రాథమికంగా మార్చనుంది. ఈ ఏడాది జులై, 2024లో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో కేంద్రం ఈ మేరకు షేర్ల బైబ్యాక్ కొత్త ట్యాక్స్ రూల్స్ ప్రతిపాదించింది. సాధారణంగా షేరు ధర తక్కువగా ఉందని భావిస్తే బైబ్యాక్ చేపట్టి తమ వాటాదారులకు లబ్ధిచేకూరుస్తాయి కంపెనీలు. అయితే, ఈ కొత్త రూల్స్ అమలులోకి వస్తే బైబ్యాక్‌కు షేర్ హోల్డర్లు అంగీకరించకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. దీంతో చాలా కంపెనీలు ఇప్పటికే బైబ్యాక్ చేపట్టాయి.
Amaravati News Navyandhra First Digital News Portal