US Elections: అమెరికా అధ్యక్ష పీఠాన్ని ఎక్కేది ఎవరు అనేది ప్రస్తుతం ప్రపంచ దేశాలను ఆసక్తిగా తిలకించేలా చేస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఎవరు ఉంటే తమకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది ప్రపంచ దేశాలు బేరీజు వేసుకుంటూ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడి హోదాలో ఎవరు ఉంటే తమ దేశంతో సంబంధాలు ఎలా ఉంటాయి అని అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్.. వీళ్లిద్దరిలో ఎవరు గెలిచినా ఆ దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా వారు తమ దేశ సొంత ప్రయోజనాలకే పని చేస్తారని జై శంకర్ పేర్కొన్నారు. అగ్రరాజ్య తదుపరి అధ్యక్షులుగా ఎవరు ఎన్నికైనా వారి సొంత ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తారని తెలిపారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల విదేశాంగ మంత్రులతో జరిగిన చర్చా కార్యక్రమంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.