జాక్వెలిన్‌కు లగ్జరీ షిప్.. సుఖేష్ చంద్రశేఖర్ బర్త్‌డే గిఫ్ట్‌.. ఫ్యాన్స్‌కు 100 ఐఫోన్లు

Sukesh Chandrashekhar: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. జైలు నుంచే సంచలన వ్యాఖ్యలు, లేఖలు పంపిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్.. తాజాగా మరో బాంబు పేల్చాడు. తన ప్రేయసి, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బర్త్ డే సందర్భంగా ఖరీదైన బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపాడు. ఆమెకు లగ్జరీ షిప్‌ గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు పేర్కొన్నాడు. అదే సమయంలో ఫ్యాన్స్‌కు కూడా 100 ఖరీదైన ఐఫోన్లను.. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బర్త్ సందర్భంగా గివ్ అవే ఇవ్వనున్నట్లు స్పష్టం చేశాడు. దీంతో మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు.. తాజాగా సుఖేష్ చంద్రశేఖర్.. బర్త్ డే గిఫ్ట్‌ల వ్యవహారం మరో తలనొప్పిగా మారింది.

ప్రస్తుతం రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేష్ చంద్రశేఖర్.. ప్రస్తుతం ఢిల్లీ జైలులో ఉన్నాడు. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ను మరోసారి ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్ బర్త్‌ డేకు ఎవరూ ఊహించని స్పెషల్‌ గిఫ్ట్‌ను పంపిస్తునట్లు వెల్లడించాడు. ఖరీదైన నౌకను ఆమెకు బహుమతిగా పంపిస్తునట్టు జైలు నుంచే తెలిపాడు. తాజాగా జైలు నుంచి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌కు సుఖేశ్‌ చంద్రశేఖర్‌ లేఖ రాశాడు. ఇక ఖరీదైన నౌకకు లేడీ జాక్వెలిన్‌గా పేరు కూడా పెట్టినట్టు పేర్కొన్నాడు. అంతేకాదు జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్ అభిమానులకు కూడా 100 ఐఫోన్లను గిఫ్ట్‌గా పంపిస్తునట్టు వెల్లడించాడు.

రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తరచుగా జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌కు లేఖలు రాస్తున్నాడు. గతంలో సుఖేష్ చంద్రశేఖర్ ఇచ్చిన బహుమతుల కారణంగానే జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్ చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే కొన్నిసార్లు ఈడీ విచారణకు కూడా జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు హాజరుకావాల్సి వచ్చింది. ఇప్పుడు లేడీ జాక్వెలిన్‌ పేరుతో ఖరీదైన యాట్‌(నౌక)ను బహుమతిగా ఇస్తానని ప్రకటించడం మరింత సంచలనంగా మారింది.

ఇక ఆర్థిక మోసాలతో సుఖేష్ చంద్రశేఖర్‌ వందలకోట్లు సంపాదించినట్లు అతనిపై పలు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఈడీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం జైల్లో ఉన్న ఉన్నాడు. అయితే ఈ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ 2021లో ఎంచుకున్న లగ్జరీ విహార నౌకను తాను ఇప్పుడు బహుమతిగా ఇస్తున్నట్లు సుఖేష్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు. అయితే నౌక ఈ నెలలోనే డెలివరీ అవుతుందని దానికి అన్ని ట్యాక్సులు ఇప్పటికే చెల్లించినట్లు తెలిపాడు. అయితే ఈ ఖరీదైన గిఫ్ట్‌ గురించి సుఖేష్ చేసిన ప్రకటనపై జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్ ఇప్పటివరకు స్పందించలేదు.

About amaravatinews

Check Also

టెట్ అభ్యర్ధులకు రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగిస్తూ ప్రకటన జారీ

టెట్ అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. దేశంలోని వివిధ రీజియన్లలో గ్రాడ్యుయేట్ టీచర్లు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *