వినేశ్ ఫోగట్ అంశంపై చర్చకు నిరాకరణ.. పార్లమెంట్ నుంచి విపక్షాలు వాకౌట్

ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగట్‌ అనర్హత అంశంపై చర్చించాలని రాజ్యసభలో విపక్ష ఇండియా కూటమి నేతలు పట్టుబట్టాయి. ఇందుకు ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ నిరాకరించడంతో విపక్షాలు వాకౌట్ చేశారు. వినేశ్ ఫోగట్ తాను పోటీ పడిన 50 కిలోల విభాగంలో ఫైనల్‌కు చేరుకోగా.. తుదిపోరుకు కొద్ది గంటల ముందే నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువ ఉందనే కారణంతో అనర్హురాలిగా ప్రకటించడంతో యావత్తు దేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ఒలింపిక్ నిర్వాహకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అటు ప్రధాని నరేంద్ర మోదీ.. భారత ఒలింపిక్ కమిటీ ఛైర్మన్ పీటీ ఉషతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

అయితే, ప్రతిపక్షాల మాత్రం వినేశ్ ఫోగట్ అనర్హత అంశంపై చర్చించాలని గురువారం ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే డిమాండ్ చేశాయి. కానీ, ఛైర్మన్ అనుమతించకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ పార్లమెంట్ ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వివేశ్ ఫోగట్ అంశంపై చర్చించడానికి ఛైర్మన్ అనుమతించకపోవడంతో ఇండియా కూటమి సభ్యులంతా రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.. ఆమె అనర్హత వెనుక అంశాలపై చర్చించాలని మేము కోరాము కానీ ప్రభుత్వం అందుకు సిద్దంగా లేదు’ అని ఆయన విమర్శించారు.

ఇక, రెజ్లింగ్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు వినేశ్ ఫోగట్ చేసిన ప్రకటనపై కూడా తివారీ మాట్లాడారు. తన నిర్ణయాన్ని ఫోగట్ వెనక్కు తీసుకోవాలని, నిరాశకు గురికావద్దని దేశం మొత్తం ఆమెకు మద్దతుగా ఉందని అన్నారు. దీనిపై కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవీయ లోక్‌సభలో బుధవారం చేసిన ప్రకటనపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఆమె ఒలింపిక్ సన్నాహాల కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసిందన్న కేంద్ర మంత్రి ప్రకటనపై కొంతమంది ప్రతిపక్ష నాయకులు విరుచుకుపడ్డారు.

ఇక, ఒలింపిక్స్‌ అసమాన పోరాటంతో వినేశా ఫైనల్ చేరింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ నెంబర్ వన్ జపాన్ రెజ్లర్‌‌కు షాకిచ్చింది. ఆ మ్యాచ్‌లో జపాన్ రెజర్లదే చివరి 10 సెకెన్ల వరకూ ఆధిపత్యం. కానీ, అక్కడే వినేశ్ మ్యాజిక్ చేసి ఆమెను మట్టికరిపించి, క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్, సెమిస్‌లో వినేశ్ దూకుడు ముందు ప్రత్యర్థులు చిత్తుయ్యారు.

About amaravatinews

Check Also

మజ్లిస్‌ ఎంపీ ఒవైసీకి యూపీ కోర్టు నోటీసులు.. ఎందుకంటే…

ఎంపీగా ప్రమాణం చేసిన రోజు జై పాలస్తీనా అని నినాదాలు చేసినందుకు మజ్లిస్‌ ఎంపీ ఒవైసీకి యూపీలోని బరేలి కోర్టు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *