వారందరికీ నోటీసులు పంపుతోన్న ఐటీ శాఖ.. రూ.6 లక్షలు దాటితే అంతే..!

Remittance: మీరు విదేశాలకు డబ్బులు పంపిస్తున్నారా? ట్యాక్స్ తప్పించుకునేందుకు అడ్డదారులు అనుసరిస్తే మీకు నోటీసులు రావచ్చు. తాజాగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 6 లక్షలు ఆపైన ఫారెన్ రెమిటెన్స్ (విదేశీ చెల్లింపులు) ట్రాన్సక్షన్లపై సమగ్ర పరిశీలన చేయనుంది. విదేశాలకు రూ. 6 లక్షలకు మించి డబ్బులు పంపిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టనుంది. ఫారెన్ రెమిటెన్స్‌లో ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు చాలా మంది అడ్డదారులు తొక్కుతున్నారని ఐటీ శాఖ దృష్టికి వచ్చిన క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. రెమిటెన్స్ డేటాలో తేడాలు, పన్ను ఎగవేతలను గుర్తించేందుకు విదేశీ ట్రాన్సాక్షన్లపై సమగ్రంగా పరిశీలిన చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

కొంత మంది పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌లో ప్రకటించిన ఆదాయం, విదేశీ చెల్లింపుల డేటాల్లో అస్సలు పొంతన ఉండటం లేదనే అంశాన్ని ఐటీ శాఖ గుర్తించింది. ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (Tax Deducted at Source)లోనూ లోపాలు గుర్తించింది. ఫారం 15cc వెరిఫికేషన్, పరిశీలనలను ప్రారంభించాలని సీబీడీటీ ఫీల్డ్ ఫార్మేషన్లను కోరింది. ఫారం 15సీసీ డేటాను 2016 నుంచి సేకరిస్తున్నారు. ఇది గత ఏడాదే సమీక్ష సిఫార్సు చేయబడిందని, తొలిసారి ఫీల్డ్ ఫార్మేషన్‌కు త్వరలో అందుబాటులోకి వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ఫారెన్ రెమిటెన్స్ కేసులు గుర్తించేందుకు ఈ చర్య సహాయపడుతుందని పేర్కొన్నాయి. కొంత మంది విదేశీ చెల్లింపులు చేసినా ఆదాయపు పన్ను శాఖకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, అలాంటి వారి వివరాలు ఇప్పుడు బహిర్గతమవుతాయని పేర్కొన్నారు.

పన్ను ఎగవేతలను అరికట్టేందుకే ప్రత్యక్ష పన్నుల బోర్డు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఫారెన్ రెమిటెన్స్ నిబంధనల్లో ఉన్న సడలింపులను దుర్వినియోగం కాకుండా నిరోధించి చట్టబద్దమైన పేమెంట్లను సులభతరం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 2020-21 నుంచి ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న విదేశీ చెల్లింపుల డేటాను పరిశీలించి.. హై రిస్క్ కేసుల లిస్ట్ తయారు చేయనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 30వ తేదీలోగా ఆ జాబితాను అందించేందుకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని రూపొందించాలని ఫీల్డ్ ఫార్మేషన్లను ఐటీ శాఖ ఆదేశించింది. ఐటీ శాఖకు ఎలాంటి వివరాలు అందించకుండా రూ.6 లక్షలు ఆపైన ఫారెన్ రెమిటెన్సులు చేసిన వారికి డిసెంబర్ 31 లోపు ట్యాక్స్ నోటీసులు ఇవ్వనుంది సీబీడీటీ.

విద్య, వైద్యం కోసం చేసే విదేశీ ఖర్చులపై మినహాయింపు కల్పిస్తూ సరళీకృత రెమిటెన్స్ స్కీమ్ (LRS) తీసుకొచ్చింది కేంద్రం. దీని ద్వారా రూ. 7 లక్షల లోపు విదేశీ చెల్లింపులకు ఎలాంటి ట్యాక్స్ కట్ చేయడం లేదు. ఆపైన ఉంటే శాతం టీసీఎస్ కట్ చేస్తోంది. అయితే ఫారం 15సీసీ ద్వారా ఫారిన్ రెమిటెన్స్ రిపోర్టింగ్ కింద రెమిటర్ లేదా డిడక్టర్.. విదేశీ చెల్లింపులపై ట్యాక్స్ విధించబడదని ధ్రువీకరిస్తే ఎలాంటి అదనపు వివరాలు ఇవ్వనవసరం లేదు. ఈ సడలింపులను దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఐటీ శాఖ దృష్టి గుర్తించింది. రూ.6 లక్షలకుపైగా విదేశీ చెల్లింపులు చేసిన ట్రాన్సాక్షన్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపింది.

About amaravatinews

Check Also

ఎయిర్‌టెల్‌ సూపర్‌ ప్లాన్‌.. కేవలం రూ.1999 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ!

Airtel Cheapest Plan: ప్రైవేట్‌ కంపెనీలు వెళ్లిపోయిన వినియోగదారులను తిరిగి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. తక్కువ ధరల్లో ప్లాన్స్‌ను తీసుకువస్తున్నాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *