Penny Multibagger Stocks: దలాల్ స్ట్రీట్‌లో మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించే స్టాక్స్ ఎన్నో ఉంటాయని చెప్పొచ్చు. వీటిని కనిపెట్టడమే కాస్త కష్టం. అయితే మార్కెట్లను రెగ్యులర్‌గా జాగ్రత్తగా గమనిస్తూ.. ఆర్థిక నిపుణుల సలహా తీసుకొని ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ పెట్టుబడులు పెడితే దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందుకునే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఆయా కంపెనీల పనితీరు, ప్రకటనలు, ఫలితాలు, పెట్టుబడి వ్యూహాలు, ప్రణాళికలు ఇలా అన్నింటినీ పరిశీలిస్తుండాలి. అప్పుడు నిపుణుల సలహాతో పెట్టుబడి పెట్టాలి. దీంతో లాంగ్ రన్‌లో మంచి లాభాలు అందుకునే అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. ఇలా స్టాక్ మార్కెట్లలో మల్టీబ్యాగర్ రాబడి అందించిన ఒక స్టాక్ గురించి మనం తెలుసుకుందాం.
అదే పోపీస్ కేర్స్ లిమిటెడ్. ఇది ఒకప్పుడు పెన్నీ స్టాక్. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఏదైనా మంచి లాభాలే అందుకున్నారు. పెన్నీ స్టాక్స్ కాస్త రిస్క్‌తో కూడుకొని ఉంటాయి. అందుకే కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకొని.. భవిష్యత్తు కార్యచరణ గురించి అధ్యయనం చేసి ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇలా లక్షల్లో లాభాలు అందుకోవచ్చు.
గత నాలుగేళ్ల కాలంలో చూస్తే పోపీస్ స్టాక్ ఏకంగా 8861 శాతం పెరిగింది. 2020 ఆగస్ట్ సమయంలో ఈ షేర్ ప్రైస్ రూ. 1.80 వద్ద ఉండగా.. ఇప్పుడు అది రూ. 161.30 వద్దకు చేరింది. ఇదే 52 వారాల గరిష్ట ధర కూడా. ఈ క్రమంలోనే నాలుగేళ్ల కిందట రూ. లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే.. ఇప్పుడు అది రూ. 89.61 లక్షలు అయి ఉండేది.
ఇక గత కొన్ని సెషన్లుగా అప్పర్ సర్క్యూట్ కొడుతూనే ఉంది. ప్రతి రోజూ 2 శాతం పెరుగుతూ వస్తోంది. గత 5 రోజుల్లో 8 శాతానికిపైగా పెరిగింది. ఇక నెల వ్యవధిలో చూస్తే ట్రేడింగ్ జరిగిన రోజులన్నీ 2 శాతం చొప్పున పెరిగి ఏకంగా 48.35 శాతం పెరగడం విశేషం. 6 నెలల్లో చూస్తే కూడా 44 శాతం ఎగబాకింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అయితే 175 శాతం పెరిగింది.
అదే ఏడాదిలో అయితే ఏకంగా 1600 శాతానికిపైగా పెరిగింది. ఏడాది వ్యవధిలోనే లక్ష పెట్టుబడిని రూ. 17 లక్షలు చేసింది. ఇక కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 97.86 కోట్లుగా ఉంది. 52 వారాల కనిష్ట విలువ రూ. 89.15 వద్ద ఉంది. 2021 ఆగస్ట్ నుంచి చూస్తే రూ. 2.5 నుంచి ప్రస్తుత స్థాయికి చేరింది. ఈ క్రమంలో 6352 శాతం పెరిగింది. ఈ కంపెనీ విషయానికి వస్తే ఇది బేబీ కేర్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేస్తుంది. ఇందులో షర్ట్స్, షార్ట్స్, స్లీప్ ష్యూట్స్, పార్టీ వేర్, టీ- షర్ట్స్, ప్యాంట్స్ వంటివి ఉన్నాయి. ఇంకా వైప్స్, షాంపూ, బాడీ వాష్, బాతింగ్ బార్స్, గ్లిజరిన్ సోప్స్, డైపర్స్, హెర్బల్ పౌడర్స్ కూడా ఉన్నాయి.