కర్నూలులో బంపరాఫర్ ఇచ్చారు.. రూ.100కే చికెన్ అన్నారు. ఇంకేముంది జనాలు అక్కడికి క్యూ కట్టారు.. దెబ్బకు రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నగరంలోని మద్దూర్ నగర్‌లో షమీర్ చికెన్ సెంటర్, సుభాన్ మటన్ చికెన్ సెంటర్‌లు ఉన్నాయి. వీరిద్దరు ఒకరిపై మరొకరు పోటీపడి కిలో చికెన్ ధర రూ.100కు తగ్గించారు. దీంతో జనాలు చికెన్ కొనేందుకు షాపుల దగ్గర బారులు తీరారు. ఈ ఆఫర్ ఏమో కానీ వాహనాల రాకపోకలకు రెండు గంటలకు పైగా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు కలగ జేసుకొని ట్రాఫిక్ సరిదిద్దాల్సి వచ్చింది.
చికెన్ కేజీ రూ.100 కావడంతో.. కార్తీకమాసం అయినా సరే ప్రజలు చికెన్ కొనుగోలు చేసేందుకు వచ్చారు. తనకు సొంత ఫారం ఉందని.. తెలుగుదేశం పార్టీ భారీ మోజార్టీతో గెలిచినందుకు పార్టీపై అభిమానంతో ఈ ఆఫర్ ప్రకటించానని సమీర్ చికెన్ సెంటర్ నిర్వాహకుడు చెబుతున్నారు. అందుకే ప్రజలకు రూ.100కే చికెన్ విక్రయిస్తున్నానని చెప్పారు. అలాగే కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్‌కు మంత్రి పదవి వచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అంటున్నారు. కార్తీకమాసం కావడంతో చికెన్ కొనుగోలుదారులకు తనవంతుగా తగ్గింపు ధరలకు అందిస్తున్నామని సుభాన్ చికెన్ సెంటర్ నిర్వాహకుడు చెప్పారు.
Amaravati News Navyandhra First Digital News Portal