రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌కు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి!

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు నివాళులర్పించారు.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. వీరితో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, రాజ్యసభలో సభా నాయకుడు జెపి నడ్డా, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు.

అంబేడ్కర్​ జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయునికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అట్టడుగు వర్గాలకు అవకాశాల కోసం అంబేద్కర్‌ పేరిట నాలెడ్జ్ సెంటర్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాజీవ్ యువ శక్తి పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజల హక్కుల కోసం అంబేద్కర్‌ చేసిన పోరాటం ప్రపంచానికి ఆదర్శమని, ఆయన ఆశయాలను సాకారం చేయడానికి అందరూ కృషి చేయాలని సీఎం రేవంత్ అన్నారు. ఇక నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

రాజ్యాంగ నిర్మాత… భారతరత్న…డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా…ట్యాంక్ బండ్ వద్దఆ మహనీయుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి… ఘనంగా నివాళి అర్పించడం జరిగింది.

డాక్టర్‌ బీఆర్ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా, ఆ మహానుభావుడు అందించిన సేవలు చిరస్మరణీయమని సీఎం చంద్రబాబు ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆయనకు హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నట్లు ఎక్స్‌ వేదికగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ తెలిపారు. అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తూ..కూటమి ప్రభుత్వం అంబేడ్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్తుందని ఆయన తెలిపారు.

“ఎప్పుడూ అప్రమత్తులై, విద్యావంతులై ఆత్మగౌరవంతో, ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది” అన్నారు భారతరత్న డా॥ భీంరావు రాంజీ అంబేద్కర్. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషిచేద్దాం.…

డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ సామాజిక సంస్కర్త, ఆర్థికవేత్త, రాజకీయవేత్త, ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి. సమాజంలోని అణగారిన వర్గాలపై సామాజిక, కుల వివక్షను అంతం చేయడానికి నిరంతరం కృషి వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్. స్వతంత్ర భారతదేశానికి తొలి న్యాయ మంత్రిగా పనిచేసిన వ్యక్తి. 1990లో మరణానంతరం ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం, భారతరత్న లభించింది.

About Kadam

Check Also

‘ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశానం’.. RSS చీఫ్ భగవత్ సామాజిక ఐక్యతా మంత్రం

అలీఘర్‌లో ఐదు రోజుల పర్యటనలో ఉన్న RSS చీఫ్ మోహన్ భగవత్ వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఆయన ఓ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *