ప్రధాని మోదీకి ధర్మ చక్రవర్తి బిరుదు ప్రదానం..! ఎవరిచ్చారంటే..?

జైన సన్యాసి ఆచార్య శ్రీ 108 విద్యానంద జీ మహారాజ్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి “ధర్మ చక్రవర్తి” బిరుదు ప్రదానం చేశారు. ఈ గౌరవాన్ని ప్రధానమంత్రి మోదీ స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “నేను దీనికి తగినవాడిని కాదని నేను భావిస్తున్నాను. కానీ సాధువుల నుండి మనం ఏది స్వీకరించినా దానిని ప్రసాదంగా స్వీకరిస్తాం అనేది మన సంస్కృతి. కాబట్టి, నేను ఈ ప్రసాదాన్ని వినయంగా స్వీకరించి మా భారతికి అంకితం చేస్తున్నాను.” అని అన్నారు. ఆచార్య శ్రీ 108 విద్యానంద్ జీ మహారాజ్ కు ఏడాది పొడవునా నిర్వహించే జాతీయ నివాళికి ఈ శతాబ్ది ఉత్సవాలు నాంది పలుకుతాయి. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఢిల్లీలోని భగవాన్ మహావీర్ అహింసా భారతి ట్రస్ట్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు గౌరవనీయ జైన నాయకుడి ఆధ్యాత్మిక, పండిత వారసత్వాన్ని స్మరించుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ఆచార్య విద్యానంద్ జీ జూన్ 28, 1987న ‘ఆచార్య’ బిరుదును పొందారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. “ఇది కేవలం గౌరవం కాదు, జైన సంస్కృతిని సంయమనం, కరుణతో అనుసంధానించే పవిత్ర ధార” అని మోదీ అన్నారు. ఈ వేడుకలను క్రమశిక్షణ, సన్యాసి జీవితాన్ని గుర్తుచేసే వేడుకలుగా అభివర్ణిస్తూ, ప్రధానమంత్రి ఆచార్యకు తన నివాళులర్పించారు. శత జయంతి నివాళిలో భాగంగా ప్రధానమంత్రి మోదీ, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆచార్య శ్రీ 108 విద్యానంద్ జీ మహారాజ్ గౌరవార్థం స్మారక పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేశారు. అంతకుముందు రోజు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి షెకావత్ “ఆచార్య శ్రీ 108 విద్యానంద్ జీ మహారాజ్ జీవితం, వారసత్వం” అనే ప్రదర్శనను సందర్శించారు. ఈ ప్రదర్శనలో ఆచార్య ఆధ్యాత్మిక ప్రయాణంలోని కీలక ఘట్టాలను వర్ణించే కుడ్యచిత్రాలు చిత్రాలు ప్రదర్శించారు.

About Kadam

Check Also

ఉపాధి హామీలో ఇకపై అలా నడవదు.. రెండు సార్లు ఫొటో దిగితేనే కూలీలకు డబ్బులు..

ఉపాధి హామీ పథకం.. ఎంతో మంది నిరుపేద గ్రామస్థులకు ఈ పథకం ఒక వరం. గ్రామాల్లో సరిగ్గా పని లేనివారిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *