యుద్ధం అంచున పశ్చిమాసియా.. మోదీ అధ్యక్షతన భద్రతా క్యాబినెట్ కమిటీ అత్యవసర భేటీ

పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధ విస్తరణ భయాలు నెలకున్న వేళ.. భద్రతా క్యాబినెట్ కమిటీ అత్యవసర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం, రక్షణ, విదేశాంగ, ఆర్దిక మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై చర్చించనుంది. లెబనాన్‌లో పరిమితి స్థాయిలో ఇజ్రాయేల్‌ భూతులు దాడులు ప్రారంభించిన కొద్ది గంటల్లోనే.. టెల్ అవీవ్, జెరూసలెం లక్ష్యంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించడంతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇది మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ తరుణంలో పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలను తీవ్రమైనవిగా అభివర్ణిస్తూ.. విస్తరిస్తున్న సంక్షోభం నుంచి ఉత్పన్నమయ్యే వివిధ సమస్యలపై అత్యుతన్న స్థాయి కమిటీ అధ్యయనం చేసింది. వాణిజ్యం, రవాణా, సప్లయ్ ఛైన్స్ ముఖ్యంగా ఆయిల్, పెట్రోలియం, ఇతర ఉత్పత్తుల సహా కీలక అంశాలపై చర్చించనున్నారు. దౌత్యం, చర్చల ద్వారా అన్ని సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని, యుద్ధాన్ని నివారించాలని అన్ని పక్షాలను భారత్ కోరింది. ‘ఈ సంఘర్షణ తీవ్రమైన ప్రాంతీయ యుద్ధంగా మారవద్దని కూడా చెప్పింది.

కాగా,ఈ సంఘర్షణ ప్రభావం కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాదు. మిగతా ప్రాంతాన్ని, ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల పెరుగుదలతో కీలకమైన ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్ మార్గాల్లో వాణిజ్యానికి తీవ్ర అంతరాయం ఉంటుందని భారత్ ఆందోళన చెందుతోంది. ఇరాన్-మద్దతున్న హెజ్బొల్లా మిలిటెంట్లకు.. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకు సన్నిహిత సంబంధాల ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్ మార్గాల్లో సరుకును రవాణా చేసే వ్యాపార నౌకలు, చముర నౌకలపై హౌతీలు మరిన్ని దాడులు చేసే అవకాశం ఉంది. ఇది వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

గతేడాడి అక్టోబరు నుంచే ఎర్ర సముద్రంలో సంక్షోభం మొదలైంది. హమాస్‌కు మద్దతుగా ఇజ్రాయేల్‌, దాని మిత్రదేశాల వాణిజ్య నౌకలపై హౌతీలు దాడులు చేస్తున్నారు. భారత్‌కు వచ్చే పెట్రోలియం ఎగుమతులపై ఇది ప్రభావం చూపింది. ఈ ఏడాది ఆగస్టులో 37.56 శాతం పడిపోయి $5.96 బిలియన్లకు చేరింది. గతేడాది ఏడాది ఇదే నెలలో $9.54 బిలియన్లుగా ఉంది.

2023 డేటా ప్రకారం సూయజ్ కాలువతో అనుసంధానమయ్యే ఎర్ర సముద్రం మార్గంలో భారతదేశ ఎగుమతుల్లో 50 శాతం అంటే రూ. 18 లక్షల కోట్లు, 30 శాతం దిగుమతులు అంటే రూ. 17 లక్షల కోట్ల విలువైనవి. గత ఆర్దిక సంవత్సరంలో భారత్ వాణిజ్యం (ఎగుమతులు, దిగుమతులు) విలువ రూ.94 లక్షల కోట్లు కాగా.. ఎగుమతులు 68 శాతం, దిగుమతులు 98 శాతం సముద్రమార్గం గుండానే సాగుతున్నాయి. అలాగే, గల్ఫ్ దేశాలతో భారత్‌కు పెద్ద ఎత్తున వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. భారత్ మొత్తం వాణిజ్యంలో ఈ దేశాల వాటా 15 శాతం. ఇంధనం, రక్షణ, భద్రత, ఆరోగ్య రంగాల్లో గణనీయమైన వృద్ధి ఉంది.

About amaravatinews

Check Also

భారీ భద్రతా వైఫల్యం.. బ్రిటన్‌ రాజసౌధంలోకి చొరబడ్డ ముసుగు దొంగలు.. !

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే బ్రిటన్‌ రాజ భవనంలోకి ముసుగు దొంగలు చొరబడటం కలకలం రేపుతోంది. కింగ్ ఛార్లెస్‌ (King …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *