భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(droupadi murmu) నేడు(ఆగస్టు 14న) 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం రాత్రి 7 గంటల నుంచి ఆల్ ఇండియా రేడియోతోపాటు జాతీయ నెట్‌వర్క్ దూరదర్శన్‌లోని అన్ని ఛానెల్‌లలో హిందీలో ఆపై ఇంగ్లీష్ వెర్షన్‌లో ప్రసారం చేయబడుతుంది.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(droupadi murmu) నేడు(ఆగస్టు 14న) 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం రాత్రి 7 గంటల నుంచి ఆల్ ఇండియా రేడియోతోపాటు జాతీయ నెట్‌వర్క్ దూరదర్శన్‌లోని అన్ని ఛానెల్‌లలో హిందీ, ఇంగ్లీష్ వెర్షన్‌లలో ప్రసారం చేయబడుతుంది. దూరదర్శన్‌లో హిందీ, ఇంగ్లీషులో ప్రసారం చేసిన తర్వాత, దూరదర్శన్ ప్రాంతీయ ఛానెల్‌లు ప్రాంతీయ భాషలలో ప్రసారం చేస్తాయి. ఆల్ ఇండియా రేడియో వారి సంబంధిత ప్రాంతీయ నెట్‌వర్క్‌లలో రాత్రి 9.30 గంటలకు ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తాయి.
కార్యక్రమం ఉద్దేశం
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగం అనేది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ముఖ్యమైన సంప్రదాయంగా కొనసాగుతుంది. ఇది స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు ఆగస్టు 15న స్వాతంత్ర్య వార్షికోత్సవాన్ని గుర్తుచేసుకోవడానికి నిర్వహించబడుతుంది. ఈ సంప్రదాయం 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రారంభమైంది. అప్పటి నుంచి దీనిని ప్రతి ఎటా నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి ప్రసంగం భారతీయ ప్రజలకు దేశం సాధించిన విజయాలు, సవాళ్లు, భవిష్యత్తు ప్రణాళికలను ప్రస్తావించే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి జాతీయ ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య విలువల ప్రాముఖ్యతను నొక్కి చెప్పనున్నారు.
ప్రధాన సంఘటనలు
రాష్ట్రపతి ప్రసంగం తరచుగా మునుపటి సంవత్సరంలోని ప్రధాన సంఘటనలు, ఆర్థిక, సామాజిక పరిణామాలు, ప్రభుత్వ ప్రణాళికలను గుర్తు చేస్తుంది. దీంతోపాటు విద్య, ఆరోగ్యం, భద్రత వంటి సామాజిక, జాతీయ సమస్యలను కూడా ప్రస్తావిస్తారు. స్వాతంత్ర నోత్సవం సందర్భంగా ఈ ప్రసంగం దేశ ఐక్యత, సార్వభౌమత్వానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. దేశప్రజలను చైతన్యవంతం చేయడానికి, ప్రస్తుత పరిస్థితుల గురించి వారికి అవగాహన కల్పించడానికి ఇది ఒక మార్గమని చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో దేశం భవిష్యత్తు, దిశ, పురోగతి వంటి అంశాలను ప్రస్తావించనున్నారు.