Radhika Merchant: పేరు మార్చుకున్న అంబానీ చిన్న కోడలు.. పెళ్లి తర్వాత కీలక నిర్ణయం!

Radhika Merchant: రిలయన్స్ ఇండిస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కోడలు రాధికా మర్చంట్ తన పేరును మార్చుకున్నారు. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు, తన ప్రేమికుడైన అనంత్ అంబానీని కొద్ది నెలల క్రితమే వివాహం చేసుకున్న రాధికా మర్చంట్.. పెళ్లి తర్వాత తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది 2024, జులైలో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లకు అధికారింగా అంబానీ కుటుంబంలో కలిసిపోయారు రాధికా మర్చంట్. అదేంటి వివాహంతోనే అధికారికంగా ఎంట్రీ ఇచ్చారు కదా అని అనుకుంటున్నారా? మీరు అనేది నిజమే అయినా.. తాజాగా తన పేరులో మర్చంట్ స్థానంలో అంబానీగా మార్చుకున్నారు. ఇప్పుడు రాధికా మర్చంట్ కాదు.. రాధికా అంబానీ గా అధికారికంగా తన పేరులో మార్పు చేసుకున్నారు.

సాధారణంగానే పెళ్లి తర్వాత అమ్మాయిలకు అత్తింటి పేరు వస్తుంది. అయితే, కొందరు తన పేరును మార్చుకోరు. తల్లిగారి ఇంటి పేరుతోనే కొనసాగుతారు. అలాగే కొన్ని కమ్యూనిటీల్లో పేరు మార్పు చేసుకోరు. అయితే చాలా వరకు మన దేశంలో పెళ్లి తర్వాత అమ్మాయిలకు అత్తవారి ఇంటి పేరు వస్తుంది. అదే సంప్రదాయాన్ని కొనసాగించారు రాధికా మర్చంట్. అనంత్ అంబానీతో వివాహం జరిగిన క్రమంలో అధికారికంగా తన ఇంటి పేరును అంబానీగా మార్చుకున్నారు రాధికా. ప్రస్తుతం రాధికా మర్చంట్ పేరు మార్చుకున్న విషయంపై సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

About amaravatinews

Check Also

వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు!

Budget-2025: మధ్యతరగతి ప్రజలకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. 2025 బడ్జెట్‌లో ఆదాయపు పన్ను తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఇది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *