రైల్వే శాఖలో 11,558 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. ఇంటర్‌, డిగ్రీ అర్హత

RRB NTPC Notification 2024 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రాడ్యుయేట్ పోస్టులు (లెవల్ 5, 6 పోస్టులు), అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల (లెవల్ 2, 3) కోసం RRB NTPC 2024 షార్ట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 11,558 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా భారతీయ రైల్వేలలో వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల(NTPC) పోస్టుల కోసం మొత్తం 11,558 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు 8113 ఉన్నాయి. అలాగే.. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు 3445 ఉన్నాయి. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్-స్థాయి పోస్టుల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు తేదీల ప్రకారం.. అప్లయ్‌ చేసుకోవచ్చు.

గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 13, 2024 వరకు కొనసాగుతుంది. అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 20, 2024 వరకు ఉంటుంది.

గ్రాడ్యుయేట్ పోస్టుల్లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉండే అవకాశం ఉంది. అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో చూసుకుంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు ఉద్యోగాలు ఉండే ఛాన్స్ ఉంది. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్‌/12వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

About amaravatinews

Check Also

రెవ్వెన్యూ శాఖలోకి మళ్లీ జేఆర్వోలు.. అన్ని గ్రామాల్లో 10,911 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో దాదాపు 2 వేల వరకు ‘జూనియర్‌ రెవెన్యూ అధికారి (జేఆర్‌ఓ)’ పోస్టులను ప్రభుత్వం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *