ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక.. విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లకు స్టాపేజీలు కల్పిస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో 40 రైళ్లు కొత్తగా మరో 30 స్టేషన్లలో ఆగనున్నాయి. రైల్వే అధికారులు దీనిని ప్రయోగాత్మకంగానే అమలు చేస్తున్నారు. డిమాండ్‌ను బట్టి కొంతకాలం తర్వాత పునరాలోచన చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు దశలవారీగా ఆయా రైళ్లలో కొత్త హాల్ట్‌లు ప్రారంభమవుతాయి.
ప్రకాశం జిల్లా చినగంజాం రైల్వే స్టేషన్‌లో.. పూరి-తిరుపతి (17479), తిరుపతి-కాకినాడ టౌన్ (17249), బిలాస్‌పూర్-తిరుపతి (17481) రైళ్లు ఆగుతాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, సత్తెనపల్లి, నడికుడి స్టేషన్లలో.. భువనేశ్వర్-సికింద్రాబాద్ (17015), భువనేశ్వర్-సికింద్రాబాద్ (17015) రైళ్లకు హాల్ట్‌లు ఇచ్చారు. లింగంపల్లి- నర్సాపూర్ (17256), చెంగల్‌పట్టు-కాకినాడ (17643)కు మంగళగిరి స్టేషన్‌లో హాల్ట్ కల్పించారు. ధర్మవరం-రేపల్లె (17216)కు ప్రకాశం జిల్లా గిద్దలూరు స్టేషన్‌లో స్టాప్ ఇచ్చారు.
నాగర్‌సోల్-నర్సాపూర్ (17232) రైలుకు సత్తెనపల్లి స్టేషన్‌తో పాటు నడికుడి, పిడుగురాళ్ల స్టేషన్లలో స్టాప్ కల్పించారు.