గేమ్ ఛేంజర్ సినిమాను దాదాపుగా మూడేళ్లుగా చెక్కుతూనే ఉన్నారు డైరెక్టర్ శంకర్. మధ్యలో వేరే శిల్పాన్ని (ఇండియన్ 2) కూడా చెక్కారనుకోండి అది వేరే విషయం. అయితే గేమ్ ఛేంజర్ మాత్రం అదిరిపోతుంది.. తిరుగేలేదంటూ శంకర్ ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు చెబుతూనే ఉన్నారు. కానీ ఎక్కడో కొడుతుంది శీనా అన్నట్లు ఫ్యాన్స్ పైకి చెప్పకపోయినా శంకర్ మీద కాస్త డౌటానుమానంతోనే ఉన్నారు. కానీ వీటిని గేమ్ ఛేంజర్ టీజర్ కాస్త కొంతవరకూ పోగొట్టింది. రామ్ చరణ్ చేసిన రెండు పాత్రల వేరియేషన్స్.. శంకర్ లెవల్ గ్రాండియర్‌తో టీజర్ అయితే ఫ్యాన్స్‌కి ఊపిచ్చింది. అయితే ఆ ఊపును మరో రేంజ్లో ఊపేసే జోష్ ఇచ్చారు నటుడు ఎస్జే సూర్య. తాజాగా ఆయన గేమ్ ఛేంజర్ గురించి ఓ ట్వీట్ చేశారు. దానిపై ఓ లుక్కేద్దాం.
దిమ్మ తిరుగుతుంది అందరికీ
“హాయ్ ఫ్రెండ్స్.. గేమ్ ఛేంజర్ సినిమాకి సంబంధించిన రెండు కీలక సన్నివేశాలకి ఇప్పుడే డబ్బింగ్ ఫినిష్ చేశాను. (అందులో ఒకటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారితో కాగా మరొకటి శ్రీకాంత్ గారితో). ఈ రెండు సీన్లకి డబ్బింగ్ చెప్పడానికి మూడు రోజులు పట్టింది. దాని ఔట్ పుట్ చూస్తే “దీనమ్మ దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది”.. రేపు థియేటర్లో కూడా ఈ సీన్లు చూసి మీరంతా పిచ్చెక్కిపోతారు.. పోతారు.. మొత్తం పోతారు.. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన శంకర్ సార్‌కి, నిర్మాత దిల్ రాజు గారికి, మూవీ టీమ్ మొత్తానికి థాంక్యూ. ఖచ్చితంగా ఈసారి మాత్రం ‘రామ్’పింగ్ ‘శంకర్’ఆంతి (RAM’PING SHANKAR’ANTHI)” అంటూ ఎస్జే సూర్య ట్వీట్ చేశారు.