అనకాపల్లి జిల్లాలో అరుదైన పురుగు.. ధర ఏకంగా రూ.75 లక్షలు?, ఎందుకంత డిమాండ్!

ప్రపంచంలో అత్యంత అరుదైన కీటకం అనకాపల్లి జిల్లాలో ప్రత్యక్షమైంది. చీడికాడ మండలంలోని కోనాంలో ఔషధ గుణాలు కలిగిన స్టాగ్ బీటిల్ కనిపించింది. ఈ కీటకానికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.. ఈ కీటకం ధర రూ.75 లక్షల వరకు ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. కీటకానికి అంత ధర ఏంటి అని షాకవ్వకండి.. ప్రపంచంలోనే అత్యంత ఔషధ గుణాలు కలిగిన అరుదైన కీటకం స్టాగ్ బీటిల్ అని చెబుతుంటారు. ఈ కీటకం ఎవరికైనా దొరికితే అదృష్టవంతులే అని చెబుతుంటారు. బీఎండబ్ల్యూ, ఆడి కార్ల ధర కంటే ఈ కీటకం ధర ఎక్కువ అంటే చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

ప్రపంచంలోనే అరుదైన కీటకాల్లో స్టాగ్ బీటిల్‌కు మొదటి స్థానం ఉంటుందని చెబుతుంటారు. ఈ కీటకం ప్రత్యేక రూపంలో.. ఔషధ వినియోగంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అందుకే ఔషధ తయారీదారులు దానికి అంత ప్రాధాన్యత ఇస్తారట. ఈ కీటకం ధర మన దేశంలో.. రూ.75 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. స్టాగ్ బీటిల్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కీటకాలలో ఒకటిగా గుర్తింపు ఉంది. అంతేకాదు ఈ స్టాగ్ బీటిల్స్ అడవులలో నేపై కనిపిస్తాయి. మరికొన్ని డ్రిఫ్టుడ్ సమీపంలోని ఇసుక ప్రవాహ ఒడ్డుకు తరచుగా వస్తాయి.

ఇతర కీటకాల మాదిరిగానే స్టాగ్ బీటిల్ కాలినడకన, రెక్కల ద్వారా వెళతాయి. ఈ కీటకాలు ఆహార వనరులు, గుడ్లు పెట్టే ప్రదేశాలకు సమీపంలో ఉంటాయి. లార్వా కుళ్లిన లాగ్లలో నివసిస్తుంది..పెద్ద కీటకాలు చెట్ల రసాన్నితింటాయి. ఈ అద్భుతమైన బీటిల్స్ ఉత్తర భారతదేశం, ఆగ్నేయాసియాలోని దట్టమైన ఉష్ణమండల, ఉప ఉష్ణమండల అడవులకు చెందినవిగా చెబుతారు. ఈ కీటకాలు సహజ ఆవాసాలైన చెట్లతో కూడిన ప్రదేశాలలో, కుళ్లిన చెక్, చెట్ల కొమ్మల్లొ కనిపిస్తాయి. ఈ స్టాగ్ బిటిల్‌లలో మగవాటికి ఎక్కువ డిమాండ్, ధర ఉంటుంది.

మగ స్టాగ్ బీటిల్ గూబలు లోతుగా ఉండి కొమ్ములు పొడవుగా ఉంటాయి. ఆడ కీటకాలకు గూబలు ఎత్తుగా ఉండి కొమ్ములు పొట్టిగా ఉంటాయి. ఆడ కీటకాల కంటే మగవాటిలోనే ఔషధ గుణాలు అధికంగా ఉంటాయని.. అందుకే దాని ధర ఎక్కువగా పలుకుతుందని చెబుతుంటారు. అయితే ఈ స్టాగ్ బీటిల్‌ల వివరాలు ప్రసార మాధ్యమాల్లో, యూట్యూబ్లో, తెలుసుకోవడం తప్ప బయట కనిపించేవి కావు అంటున్నారు. అలాంటిది తాజాగా అనకాపల్లి జిల్లాలోని చీడికాడ మండలంలోని కోనాం పంచాయితీ శివారు కొత్త వీధిలో ప్రత్యక్షమయ్యాయి.

ఆ గ్రామానికి చెందిన గేమ్మెలి చంటి అనే ఆదివాసి గిరిజనుడు ఇటీవల అటవీ ప్రాంతానికి వెళ్లడంతో స్టాగ్ బిటిల్ కనిపించింది. ఈ కీటకం వింతగా కనిపించడంతో దాన్ని పట్టుకొని ఆకుల్లో పెట్టి ఇంటికి తీసుకొచ్చారు. ఈ విషయం పలువురికి తెలియడంతో.. ఆ కీటకాన్ని చూసి స్టాగ్ బీటీల్‌గా గుర్తించారు. ఈ అత్యంత ఔషధ గుణాలు కలిగిన స్టాగ్ బీటిల్‌ను ఎవరికి విక్రయించాలో ఎలా విక్రయించాలో తెలియదట.

About amaravatinews

Check Also

శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. ఉచిత బస్సు సర్వీస్ ప్రారంభం

శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక. ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. భక్తుల సౌకర్యార్థం శుక్రవారం ఉచిత బస్సును ప్రారంభించారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *