నామినేటేడ్ పోస్టులు సహా ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పదవుల భర్తీపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పదవుల భర్తీపై ఇప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు నేతలతో చర్చించారు. పొలిట్ బ్యూరో సమావేశంలోనూ దీనిపై చర్చ జరిగింది. విడతల వారీగా నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమయంలోనే మరో కీలక పదవిని రాయలసీమకు చెందిన ఆ నేతను ఎంపిక చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి కోసం రాయలసీమకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనే రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ఉత్తరాంధ్రకు చెందిన చింతకాయల అయ్యనపాత్రుడిని ఎంపిక చేశారు.
Amaravati News Navyandhra First Digital News Portal