ఆర్‌బీఎల్ బ్యాంకు కీలక నిర్ణయం..?

ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన ఆర్‌బీఎల్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరిస్తున్నట్లు ప్రకటించింది. రూ. 3 కోట్లకు లోబడిన బ్యాంకు డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లను తీసుకొచ్చింది. 2024, జులై 29 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని బ్యాంక్ స్పష్టం చేసింది. ఇదే సమయంలో బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లపైనా వడ్డీ రేట్లు సవరించింది. ఇది మాత్రం జులై 1 నే అమల్లోకి వచ్చిందని పేర్కొంది. ఇప్పుడు సవరించిన తర్వాత ఈ బ్యాంకులో అత్యధికంగా 500 రోజుల టెన్యూర్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 8.10 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇదే సమయంలో సీనియర్ సిటిజెన్లు అదనంగా మరో 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ అందుకుంటున్నారు. వీరికి అన్నింటికంటే ఎక్కువగా 8.60 శాతం వడ్డీ వస్తుందన్నమాట. ఇంకా సూపర్ సీనియర్ సిటిజెన్లు మాత్రం ఏకంగా 8.85 శాతం వడ్డీ అందుకుంటున్నారు. అంటే వీరికి అదనంగా 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ వస్తుందని చెప్పొచ్చు.

సాధారణ ప్రజలకు ఈ బ్యాంకులో వారం నుంచి 14 రోజుల టెన్యూర్ డిపాజిట్లపై 3.50 శాతం వడ్డీ వస్తుండగా.. సీనియర్ సిటిజెన్లు 4 శాతం వడ్డీ అందుకుంటున్నారు. ఇదే బాటలో 15-45 రోజుల డిపాజిట్‌పై వరుసగా 4 శాతం, 4.50 శాతం వడ్డీ వస్తుంది. 241-364 రోజుల డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 6.05 శాతం, సీనియర్ సిటిజెన్లకు 6.55 శాతం వడ్డీ వస్తుందని చెప్పొచ్చు. ఇక 365 రోజుల నుంచి 452 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే సాధారణ ప్రజలకు 7.50 శాతం, సీనియర్ సిటిజెన్లకు 8 శాతం వడ్డీ వస్తుంది.

453 రోజుల నుంచి 499 రోజుల డిపాజిట్లపై వరుసగా 7.80 శాతం, 8.30 శాతం వడ్డీ వస్తుంది. 500 రోజుల FD పై వరుసగా 8.10 శాతం, 8.60 శాతం వడ్డీ అందుతోంది. ఇక్కడ రూ. 5 లక్షలు జమ చేస్తే వీరికి వరుసగా రూ. 55,767, 59,208 చొప్పున వడ్డీ వస్తుంది. సూపర్ సీనియర్ సిటిజెన్లకు 8.85 శాతం లెక్కన 60,934 వడ్డీ అందుతోంది.

ఈ బ్యాంకు తాజాగా పొదుపు ఖాతాలపైనా వడ్డీ రేట్లను సవరించింది. అకౌంట్ బ్యాలెన్స్‌ను బట్టి 3.75 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ అందుతోంది. అకౌంట్లో రూ. లక్ష వరకు బ్యాలెన్స్ మెయింటెయిన్ చేస్తున్నట్లయితే వడ్డీ రేటు 3.75 శాతంగా ఉంది. రూ. 10 లక్షల వరకు బ్యాలెన్స్ ఉంటే వడ్డీ 5.50 శాతం చొప్పున వస్తుంది. రూ. 10-25 లక్షల మధ్య బ్యాలెన్స్ ఉంటే 6 శాతం వడ్డీ వస్తుంది.

About amaravatinews

Check Also

Odisha: గిరిజన మహిళను కొట్టి.. బలవంతంగా మలాన్ని తినిపించి.. అమానుషం

ఓ గిరిజన మహిళపై దాడిచేసి.. ఆమెతో బలవంతంగా మానవ మలం తినిపించిన అత్యంత హేయమైన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. బొలన్‌గిర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *