ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం.. హాజరైన ప్రధాని మోదీ

ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతోపాటు ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. రేఖ గుప్తాతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణం చేయించారు. ఢిల్లీకి 9వ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా హిందీలో ప్రమాణం చేశారు. అలాగే.. పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, మంజీందర్ సింగ్ సిర్సా, రవీంద్ర ఇంద్రరాజ్, కపిల్ మిశ్రా, ఆశిష్ సూద్, పంకజ్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణం చేయించారు.

రామ్‌లీలా మైదానంలో ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది.. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ, ఎన్డీఏ కూటమికి చెందిన ముఖ్యనేతలు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తోపాటు.. 12 రాష్ట్రాల సీఎంలు, పలువురు డిప్యూటీ సీఎంల హాజరయ్యారు.

ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలుంటే ఏకంగా 48 చోట్ల BJP అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గడ్డపై ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఓటర్లకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. అద్భుతమైన విజయం తర్వాత ఢిల్లీ CMగా ఎవరికి ఛాన్స్ ఇస్తారనే దానిపై చాలా చర్చలే జరిగాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వస్తే నిన్న రాత్రి వరకూ CM ఎవరనే సస్పెన్స్‌ కొనసాగింది. చివరికి తొలిసారి MLAగా గెలిచినా రేఖా గుప్తా వైపే BJP అధిష్టానం మొగ్గుచూపింది.

About Kadam

Check Also

‘ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశానం’.. RSS చీఫ్ భగవత్ సామాజిక ఐక్యతా మంత్రం

అలీఘర్‌లో ఐదు రోజుల పర్యటనలో ఉన్న RSS చీఫ్ మోహన్ భగవత్ వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఆయన ఓ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *