ఆ జిల్లాకు సూపర్ న్యూస్.. రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్.. 4 వేల ఎకరాలు లీజుకు!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నాయి. టీడీపీ కూటమి సర్కారు చర్యల కారణంగా.. పలు కీలక ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారుతోంది. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా కనిగిరిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు కోసం కనిగిరిలో 4000 ఎకరాల బంజరు భూమిని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు లీజుకు ఇవ్వనున్నారు. గురువారం జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నాలుగు వేల ఎకరాల్లో ప్రభుత్వ భూమికి ఎకరాకు ఏడాదికి 15 వేలు చొప్పున, ప్రైవేట్ భూమికి ఏడాదికి ఎకరాకు రూ. 30వేలు చొప్పున రిలయన్స్ కౌలు చెల్లించనుంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 500 బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం రూ.65 వేలకోట్ల పెట్టుబడితో రాష్ట్రవ్యాప్తంగా 500 బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. ఒప్పందం ప్రకారం రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ (ఆర్‌బీఈఎల్) రాష్ట్రవ్యా్ప్తంగా 500 ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలోని 8 జిల్లాలలో ఈ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా సుమారుగా రెండున్నర లక్షల మందికి ఉపాధి కల్గుతుందని అధికారులు చెప్తున్నారు.

పైలట్‌ ప్రాజెక్టు కింద తొలుత కాకినాడలో 3, రాజమండ్రిలో 2, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, కర్నూలులో ఒక్కొక్కటి చొప్పున 8 ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. 2025 నవంబరు నాటికి ఈ బయోగ్యా్స్ ప్లాంట్లను ఉత్పత్తిలోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరిలో మొదటి ప్లాంటు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 4 వేల ఎకరాల భూమిని లీజుకు ఇవ్వనున్నారు. కనిగిరిలో బీడు భూములు అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ నాలుగు వేల ఎకరాలు లీజుకు తీసుకున్నారు. ఈ భూముల్లో ఒక రకమైన గడ్డిని పెంచి.. దీని ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి చేయనున్నారు. కౌలు ఒప్పందాలు పూర్తి అయితే.. జనవరి 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విశాఖ నుంచి వర్చువల్‌గా ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఒకవేళ కౌలు ఒప్పందాలు పూర్తి కాని పక్షంలో.. ప్రారంభం వాయిదా పడే అవకాశం ఉంది.

About amaravatinews

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *