Reliance Share: అంబానీ కంపెనీ అదుర్స్.. అప్పుడు వందల కోట్ల నష్టం.. ఇప్పుడు సీన్ రివర్స్.. దూసుకెళ్తున్న స్టాక్!

Reliance Power Shares: దిగ్గజ పారిశ్రామిక వేత్త, అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ నుంచి చాలానే స్టాక్స్ ఉన్నాయి. అయితే ఇవి ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాయి. తర్వాత అనిల్ అంబానీ అప్పుల్లో కూరుకుపోవడంతో దాదాపు చాలా కంపెనీలు దివాలా స్థాయికి కూడా పడిపోయాయి. బ్యాంకులకు అప్పులు చెల్లించలేక ఇబ్బందులు పడ్డారు. తన దగ్గర సంపదేం లేదని ఆయన కూడా చేతులెత్తేశారు. దీంతో ఆయా స్టాక్స్ పడిపోయాయి. కానీ కొంతకాలంగా పరిస్థితి మారిపోతోంది. ఆయన కంపెనీలు క్రమక్రమంగా కోలుకుంటున్నాయి. వ్యాపారాలు మెరుగుపడుతున్నాయి. అంబానీ కూడా మెల్లమెల్లగా అప్పులు చెల్లిస్తూ వస్తున్నారు. మళ్లీ నిధులు సమకూర్చుకుంటున్నారు. దీంతో కంపెనీలు నష్టాల నుంచి బయటికి వస్తున్నాయి. స్టాక్స్ పెరుగుతున్నాయి.

ఇప్పుడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ 2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జూన్ త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించింది. Q1 లో ఈ సంస్థ రూ. 97.85 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఆదాయం మాత్రం అంతకుముందుతో పోలిస్తే పెరిగింది. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో చూస్తే.. సంస్థ నష్టం ఏకంగా రూ. 296.31 కోట్లుగా ఉండటం గమనార్హం. దీంతో పోలిస్తే ఇప్పుడు నష్టం 67 శాతం వరకు తగ్గించుకుంది.

ఇక కంపెనీ ఆదాయం ఏడాది కిందట ఇదే సమయంలో చూస్తే రూ. 1951.23 కోట్లుగా ఉండగా.. ఇప్పుడు రూ. 2069.18 కోట్లకు పెరిగింది. ఇక సానుకూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో రిలయన్స్ పవర్ షేరు మళ్లీ దూసుకెళ్తోంది. ఇవాళ 2 శాతం వరకు పెరిగి రూ. 30.31 వద్ద ఉంది. నెల రోజుల్లో ఈ షేరు 7 శాతం పెరిగింది. ఏడాది వ్యవధిలో ఈ స్టాక్ ఏకంగా 80 శాతం పెరగడం విశేషం. మార్కెట్ విలువ రూ. 12.18 వేల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ట విలువ రూ. 34.54 కాగా.. కనిష్ట విలువ రూ. 15.55 గా ఉంది.

ఒకప్పుడు ఈ స్టాక్ రూ. 200 లెవెల్స్‌పైన ఉండేది. తర్వాత 2019లో రూపాయి స్థాయికి పతనం కావడం గమనార్హం. అయితే అక్కడి నుంచి తిరిగి కోలుకొని దాదాపు 3 వేల శాతం వరకు పెరిగింది. ఈ క్రమంలో లక్ష పెట్టుబడిని నాలుగేళ్లలోనే ఏకంగా రూ. 30 లక్షలు చేసిందని చెప్పొచ్చు. పలు బ్రోకరేజీ సంస్థలు కూడా ఈ స్టాక్ టార్గెట్ ప్రైస్ పెంచుతున్నాయి. అయితే ఆర్థిక నిపుణుల సలహా తీసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి.

About amaravatinews

Check Also

PMO, పార్లమెంట్ హౌస్‌లో ఏర్పాటు చేయబోతున్న వేద గడియారం.. దీని ప్రత్యేకమేంటంటే

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఆధునిక వేద గడియారాలు తయారవుతున్నాయి. ఇవి హిందీ, ఇంగ్లీషులో మాత్రమే కాకుండా 189 భాషలలో సమయాన్ని తెలియజేస్తాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *