పవన్ కళ్యాణ్ -ఆద్యల క్యూట్ ఫొటో.. రేణూ దేశాయ్ రియాక్షన్ వైరల్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వెళ్లారు. అయితే ఈ వేడుకలకి పవన్ కళ్యాణ్-రేణూ దేశాయ్ కుమార్తె ఆద్య కూడా హాజరైంది. స్టేజ్ మీద పవన్ కళ్యాణ్‌ తన కూతురితో సెల్ఫీ దిగుతున్నప్పుడు తీసిన ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఫొటోపైనే రేణూ దేశాయ్ రియాక్ట్ అయ్యారు.

ఆద్య అర్థం చేసుకుంటుంది

“స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకి నాన్నతో కలిసి వెళ్లనా అని ఆద్య నన్ను అడిగింది. అది విన్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. తన తండ్రితో ఆద్య కాసేపు టైమ్ స్పెండ్ చేయాలనుకుంది. అయినా సమాజంలో ఓ ముఖ్యమైన స్థానంలో ఉన్న వ్యక్తి జీవితం ఎంత విలువైనది కదా. క్షణం కూడా తీరిక ఉండదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తన తండ్రి చేస్తున్న కృషి, కేటాయిస్తున్న సమయాన్ని ఆద్య అర్థం చేసుకోవడం ఇంకా సంతోషం.” అంటూ రేణూ దేశాయ్ పోస్ట్ చేశారు.

పవన్ కళ్యాణ్ రెండో భార్య అయిన రేణూ దేశాయ్ తన పిల్లలకి ఎప్పుడూ చాలా స్వేచ్ఛనిస్తుంటారు. తన తండ్రి దగ్గరికి వెళ్లాలనుకున్నప్పుడు, వెళ్లినప్పుడు ఆ విషయాలు తనతో చెప్పినప్పుడు చాలా సంతోషంగా వింటారు. పైగా వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పొంగిపోతుంటారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని భారీ మెజార్టీతో గెలిచి డిప్యూటీ సీఎం అయినప్పుడు రేణూ దేశాయ్ కుమారుడు అకీరా నందన్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. వెంటనే తన తండ్రి పవన్ ఇంటికి వెళ్లి తన ఆనందాన్ని పంచుకున్నాడు. అంతేకాకుండా అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్లినప్పుడు అకీరాను కూడా తన వెంట తీసుకెళ్లారు.

అప్పుడు తీసిన ఫొటోలను కూడా రేణూ సోషల్ మీడియాలో పోస్టే చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి కూడా అకీరా, ఆద్య హాజరయ్యారు. మెగాస్టార్ ఫ్యామిలీతో పాటు కలిసి వీరు ఈ కార్యక్రమానికి వెళ్లారు. ఇలా తన తండ్రి విజయాన్ని పంచుకోవడంతో ఎప్పుడూ ముందున్నారు పిల్లలు. ఇక త్వరలోనే అకీరా ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే అకీరా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. జూనియర్ పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుస్తున్నారు.

About amaravatinews

Check Also

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలేదని అధికారుల తీరుకు నిరసనగా.. అమలాపురం కలెక్టరేట్లో బాధితుడు కేక్ కట్ చేసేందుకు వచ్చాడు. పిర్యాదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *