SLBCలో చివరికి దశకు రెస్క్యూ ఆపరేషన్.. మృతదేహాలకు దగ్గరగా రెస్క్యూ టీం!

ఎస్ఎల్‌బిసి టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. టన్నెల్ లో పని చేస్తున్న సమయంలో సిమెంట్‌ స్లాబ్‌ కూలడం ద్వారా 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. టన్నెల్‌ నుంచి ఇప్పటికే రెండు మృతదేహాలను బయటకు తీయగా, మిగతా ఆరు మృతదేహాల కోసం గాలింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే గత 53 రోజులుగా టన్నెల్‌లోపల సహాయక చర్యలు నిరంతయారంగా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ టన్నెల్‌లో చిక్కుకుపోయిన మిగతా ఆరుగురు కార్మికుల మృతదేహాల ఆచూకీ మాత్రం లభించట్లేదు. టన్నెల్ లో పేరుకుపోయిన మట్టి, టిబియం మిషన్ శకలాలను కన్వేయర్ బెల్ట్ ద్వారా సురక్షితంగా బయటకు తరలిస్తున్నాయి రెస్క్యూ బృందాలు . అయితే ఇంకో 20 మీటర్ల దూరంలో మృతదేహాలు ఉండే అవకాశం ఉన్నట్టు రెస్క్యూ సిబ్బంది భావిస్తున్నారు. దీనిని బట్టి నిపుణుల సూచనలతో డీ1 ప్రాంతంలో మట్టిని తొలగించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ క్రమంలో అతి త్వరలోనే మిగిలిన మృతదేహాలను కూడా బయటకి తెచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తొంది.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంలో గల్లంతైన ఎనిమిది మందిలో ఇప్పటి వరకు రెండు మృతదేహాలను రెస్క్యూ టీం బయటకు తీశారు. ఘటన జరిగిన 16 రోజుల తర్వాత ర్యాబిన్స్‌ ఆపరేటర్‌ గురుప్రీత్‌సింగ్‌ అనే కార్మికుడు మృతదేహన్ని బయటకు తీయగా.. మార్చి 25న ఇంజనీర్ మనోజ్‌కుమార్ మృతదేహాన్ని రెస్క్యూ టీం బయటకు తీసింది. ఈ ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం తర్వాత అధికారులు వారి కుటుంబసభ్యులకు అందజేశారు. SLBC ప్రమాదంలో చనిపోయిన కార్మికుల మృతుల పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.రూ.25 లక్షల నష్టపరిహారం అందించారు.

About Kadam

Check Also

25 ఏళ్ల వైభవాన్ని చాటిచెప్పేలా బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు అట్టహాసంగా ఏర్పాట్లు!

25 ఏళ్ల వైభవాన్ని చాటిచెప్పేలా అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది గులాబీ పార్టీ. బాహుబలి వేదిక.. ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *