తెలంగాణ ప్రజలకు పండగలాంటి వార్త.. నేడే అకౌంట్లలో నగదు జమ.. డిటైల్స్ ఇదిగో

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌ కార్డు జారీ పథకాలను గణతంత్ర దినోత్సవం నాడు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.. అయితే.. ఈ నాలుగు పథకాలు జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని ప్రతి మండలంలోని ఒక్కో గ్రామంలో ఇవ్వాల్టి (జనవరి 27) నుంచి అమలుకానున్నాయి.. అయితే.. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు రైతులు, రైతు కూలీలు ఖాతాల్లో జమ కాబోతున్నాయి. మండలానికో గ్రామం చొప్పున మొత్తం 606 గ్రామాల్లో రైతు భరోసా అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయబోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

మొదటి దశలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు రైతులు, ప్రజల ఖాతాల్లో జమకానున్నాయి.. మొదటి దశలో భాగంగా ఎకరాకు రూ.6000 చొప్పున రైతుల ఖాతాలలో నగదు జమ కానుంది.. మరోవైపు రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12 వేల రూపాయలు అందిస్తుంది ప్రభుత్వం.. ఈ మొత్తాన్ని కూడా నేటి నుంచి రైతు కూలీల అకౌంట్లలో జమ చేస్తుంది. మొదటి విడతలో 10 లక్షల మంది లబ్దిదారులకు లబ్ది చేకూరనుంది.

నిన్న ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో ఇవాళ్టి నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాబోతున్నాయి. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకి రైతు భరోసా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 70 లక్షల మంది రైతులకు భరోసా నిధులు అందనున్నాయి.. సాచురేషన్ పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 వేల పైచిలుకు గ్రామాల్లో మార్చి 31 లోపు పథకాలు అమలవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మార్చి వరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్..

కాగా.. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికీ మార్చి 31లోగా నాలుగు పథకాలను అందజేస్తామని ప్రభుత్వం పేర్కొంది.. అప్పటివరకు గ్రామాల వారీగా కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొంది.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామంటోన్న కాంగ్రెస్‌ సర్కార్‌, ..పొరపాటున అనర్హులకు పథకాలు అందితే వాటిని నిలిపివేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది.. పేర్లు రాని వారి మళ్లీ కొత్తగా దరఖాస్తులు సమర్పించాలని.. ఎన్ని వచ్చినా తీసుకుంటామని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మార్చి 31 వరకు అర్హులందరికీ అకౌంట్లలో నగదు జమ అవుతుందని పేర్కొంది. ఒకవేళ నగదు జమ కాని పక్షంలో స్థానిక అధికారులను సంప్రదించాలని పేర్కొంది.

About Kadam

Check Also

ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు వచ్చేశాయ్..

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు 2025 మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలయ్యాయి. నాంపల్లిలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *