చపాతీలను ఇలా తింటే బరువు తగ్గుతారు

బరువు తగ్గేందుకు చాలా మంది ఎన్నో ప్రయత్నిస్తుంటారు. నిజానికీ బరువు తగ్గించడంలో మనం తీసుకునే ఆహారం కీ రోల్ పోషిస్తుంది. తర్వాత వర్కౌట్. బరువు తగ్గించడంలో చక్కెర, కార్బోహైడ్రేట్స్‌ని కంట్రోల్ చేయాలి. అందుకోసం చపాతీలు తినొచ్చు. ఎలా చపాతీలను తింటే రిజల్ట్ ఉంటుందో.. ఏ చపాతీలు మంచివో తెలుసుకోవాలి. దీని వల్ల ఈజీగా బరువు తగ్గుతారు.

చపాతీలు అనేక రకాల పిండిలతో చేసుకోవచ్చు. ఇందులో మల్టీగ్రెయిన్స్.. అంటే చిరు ధాన్యాలు. జొన్నలు, రాగులతో కూడా చేయొచ్చు. ఈ గ్రెయిన్స్‌లో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. ఫైబర్ ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి.

ఈ చపాతీల్లో 8 నుంచి 100 కేలరీలు ఉంటాయి. దీంతో పాటు పోషకాలు ఉంటాయి. ఇక జొన్న రొట్టెల్లో 50 నుంచి 60 కేలరీలు ఉంటాయి. ఇవి గ్లూటెన్ ఫ్రీ. గ్లూటెన్ పడనివారు వీటిని తీసుకోవచ్చు. షుగర్ ఉన్నవారికి కూడా ఇవి మంచివి. రాగి రోటీలో 80 నుంచి 90 కేలరీలతో పాటు కాల్షియం, ఫైబర్స్ ఉంటాయి.

బరువు తగ్గాలనుకునేవారు జొన్నలతో రోటీలు తయారుచేసుకోవచ్చు. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చక్కెరని కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా, ఆకలిని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెరని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. జీర్ణ ఆరోగ్యానికి కూడా మంచిది.

చపాతీలపై నెయ్యి కలిపి తినడం ఇంకా మంచిది. దీని వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇది రక్తంలో చక్కెర శోషణని నెమ్మదిస్తుంది. ఆకలిని త్వరగా తగ్గిస్తుంది. ఇవన్నీ బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తాయి. అయితే, తినే మోతాదు కూడా ముఖ్యం. అన్నం మానేసి ఐదారు చపాతీలు తినడం వల్ల ఉపయోగం ఉండదు. మోతాదులోని చపాతీలను తినండి.

గమనిక : ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

About amaravatinews

Check Also

మీ పాదాలు, చేతులు మాటి మాటికీ చల్లబడుతున్నాయా? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా

సాధారణంగా వాతావరణం చల్లగా ఉంటే కాళ్లు, చేతులు, పాదాలు చల్లబడటం కామన్. ఇలా ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. కానీ కొందరికీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *