రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాలపై ప్రకటన.. వరుసగా పడిపోతున్న అంబానీ స్టాక్.. ఈసారి ఎన్ని వేల కోట్లో?

దేశంలో మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీ దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. రిలయన్స్ ఇండస్ట్రీస్ కింద ఎన్నో కంపెనీలు ఉన్నాయి. చాలా సబ్సిడరీలు ఉన్నాయి. ఆయిల్ నుంచి రిటైల్ వరకు టెలికాం నుంచి విద్యుత్ వరకు చాలానే సంస్థలు ఉన్నాయి. ఇక అంబానీ ఎప్పుడో తన సంతానానికి.. పలు విభాగాల బాధ్యతల్ని అప్పగించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ రిటైల్ విభాగం అంబానీ తనయ ఇషా అంబానీ చూసుకుంటుండగా.. రిలయన్స్ టెలికాం బాధ్యతల్ని పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ నిర్వహిస్తుండగా.. అనంత్ అంబానీ రిలయన్స్ న్యూ ఎనర్జీ వంటి విభాగం బాధ్యతల్లో ఉన్నారు. వీరి హయాంలో ఆయా విభాగాలు దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ప్రతిసారీ త్రైమాసిక ఫలితాల్లో రాణిస్తున్నాయి.

ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జులై- సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్ని ప్రకటించనుంది. దీని కోసం అక్టోబర్ 14న రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు సమావేశం కానుంది. అదే రోజు.. రెండో త్రైమాసిక ఫలితాలకు బోర్డు ఆమోదం తెలిపి.. ఫలితాల్ని వెల్లడించనుంది. ఈ మేరకు సెప్టెంబర్ 30 వరకు ముగిసిన త్రైమాసికం ఫలితాల్ని వెల్లడించనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్చేంజి ఫైలింగ్‌లో వెల్లడించింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో కాస్త నిరాశపర్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో చూస్తే నికర లాభం 5 శాతం తగ్గింది. అంతకుముందు లాభం రూ. 16,011 కోట్లుగా ఉండగా.. తొలి త్రైమాసికంలో ఇది రూ. 15,138 కోట్లుగానే వచ్చింది. ఇక ఆపరేటింగ్ రెవెన్యూ 12 శాతం పెరిగి రూ. 2.36 లక్షల కోట్లుగా నమోదైంది. నికర లాభం విషయంలో అంచనాల్ని తప్పింది. మరి ఈసారి ఎన్ని వేల కోట్ల లాభం వస్తుందో చూడాలి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ గత కొన్నాళ్లుగా ఇన్వెస్టర్లకు నిలకడగా రిటర్న్స్ అందిస్తూ వచ్చింది. టాప్ సెన్సెక్స్ పెర్ఫామర్లలో ఒకటిగా నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఇటీవల పతనం అవుతూ వస్తోంది. 3 నెలల కిందట.. 2024, జులై 8న ఈ షేరు రూ. 3217.60 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. అప్పుడు మార్కెట్ విలువ రూ. 21 లక్షల కోట్లకుపైగా కూడా చేరడం గమనార్హం. అక్కడి నుంచి పడుతూ ప్రస్తుతం రూ. 2740 లెవెల్స్‌లో ఉంది. ఈ స్టాక్ 52 వారాల కనిష్ట విలువ 2023, అక్టోబర్ 26న రూ. 2220.30 గా ఉండేది. ఇప్పుడు మార్కెట్ విలువ రూ. 18.50 లక్షల కోట్లకు పడిపోయింది. గత 5 సెషన్లలో ఒక శాతానికిపైగా నష్టపోయింది. నెల రోజుల్లో 5 శాతానికిపైగా తగ్గింది. 6 నెలల్లో కూడా నష్టాల్లోనే ఉంది.

About amaravatinews

Check Also

వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు!

Budget-2025: మధ్యతరగతి ప్రజలకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. 2025 బడ్జెట్‌లో ఆదాయపు పన్ను తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఇది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *