Ambani Shares: దేశంలోనే మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. దేశంలోనే అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ దీనికి నాయకత్వం వహిస్తున్నారు. కొంతకాలం కిందట ఏకంగా ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 21 లక్షల కోట్లను కూడా అధిగమించి ఈ ఘనత సాధించిన తొలి భారత కంపెనీగా అవతరించింది. ఇదే సమయంలో జులై నెలలో స్టాక్ రూ. 3217.60 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని కూడా నమోదు చేసింది. అయితే ఇది ఒకప్పుడు. ఇప్పుడు స్టాక్ ఎందుకో తెలియదు గానీ వరుసగా పతనం అవుతోంది. గత 3 నెలల కాలంలో ఈ షేరు 16 శాతానికిపైగా నష్టపోయింది. ఈ క్రమంలోనే కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా రూ. 3 లక్షల కోట్లకుపైగా క్షీణించింది. అంటే ఈ మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయిందని చెప్పొచ్చు. తాజాగా కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాల్ని ప్రకటించినా ఇది పెద్దగా ఆకట్టుకోలేదు. ఫలితాల తర్వాత కూడా పెద్దగా షేరు పుంజుకోలేదు.
గత 5 సెషన్లలోనే ఈ షేరు 2 శాతానికిపైగా పడిపోగా.. నెల రోజుల్లో 8 శాతానికిపైగా పడిపోయింది. ఏడాదిలో 14 శాతం మాత్రమే పెరిగింది. ఇన్వెస్టర్లకు గొప్పగా ఆకర్షణీయమైన రిటర్న్స్ ఏం అందించలేదు. స్టాక్ 52 వారాల కనిష్ట విలువ చూస్తే రూ. 2220.30 వద్ద ఉంది. ఇవాళ కూడా స్టాక్ స్వల్ప నష్టంతో రూ. 2680 లెవెల్స్‌లో ట్రేడవుతోంది. మార్కెట్ విలువ రూ. 18 లక్షల కోట్లుగా ఉంది.
తాజా ఫలితాల్లో రిలయన్స్ జియో లాభాలు భారీగా పెరిగినప్పటికీ.. రిటైల్, ఆయిల్ టు కెమికల్స్ అంతగా రాణించలేదు. వీటిల్లో ఆదాయంలో క్షీణత కనిపించింది. ఈ క్రమంలోనే జేపీ మోర్గాన్, జెఫరీస్, నోమురా, యూబీఎస్, యాక్సిస్ క్యాపిటల్, సిటీ ఇలా ఆరు ప్రముఖ బ్రోకరేజీలు రిలయన్స్ టార్గెట్ ప్రైస్ కూడా తగ్గించేశాయి. అయినప్పటికీ.. రానున్న రోజుల్లో ముకేశ్ అంబానీ అసలు ఆట ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి ఫలితాల సందర్భంగా చేసిన ప్రకటనలు సహా ఇతర నిర్ణయాలు దోహదం చేస్తాయని అంటున్నారు. అవేంటో చూద్దాం.