వైసీపీకి మరో బిగ్ షాక్.. వాసిరెడ్డి పద్మ గుడ్ బై, ఆయనకు జగన్ పదవి ఇవ్వడంతో ఆగ్రహం!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్సార్‌సీపీకి నేతలు ఒక్కొక్కరుగా గుడ్ బై చెబుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు రాజీనామా చేశారు. తాజాగా తాజాగా మరో సీనియర్ మహిళా నేత, మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పద్మ ఇవాళ అధికారికంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్‌సీపీని వీడటానికి కారణాలను ఆమె వెల్లడించే అవకాశం
ఉంది. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత వాసిరెడ్డి పద్మ ఎక్కడా పెద్దగా కనిపించలేదు.. వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

వాసిరెడ్డి పద్మ వైఎస్సార్‌సీపీని వీడటానికి కారణాలపై చర్చ జరుగుతోంది. వాసిరెడ్డి పద్మ ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట సీటు ఆశించారు.. కానీ ఆ అవకాశం దక్కలేదు. ఇటీవల జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైఎస్సార్‌సీపీని వీడి జనసేన పార్టీలో చేరడంతో.. నియోజకవర్గ ఇంఛార్జ్ పదవి ఖాళీ అయ్యింది. వాసిరెడ్డి పద్మ జగ్గయ్యపేట నియోజకవర్గానికి ఇంఛార్జ్ పదవి ఇస్తారని భావించారట.. అయితే ఇటీవల పార్టీ అధినేత వైఎస్ జగన్ తన్నీరు నాగేశ్వరరావును జగ్గయ్యపేట ఇంఛార్జ్ గా నియమించారు. ఈ క్రమంలోనే వాసిరెడ్డి పద్మ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఎన్నికల్లో జగ్గయ్యపేట టికెట్ ఆశించి దక్కకపోడంతోనే రాజీనామా చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు లేదా తన భర్తకు టికెట్ కేటాయించాలని పద్మ అడిగారట. అధిష్టానం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో రాజీనామా చేసినట్లు చర్చ నడిచింది. అయితే ఆమె తన పదవికి రాజీనామా చేసినా సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని చెప్పారు. తాను పదవికి రాజీనామా చేయడానికి కారణాలు కూడా అప్పుడే వెల్లడించారు.

About amaravatinews

Check Also

అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఇంత దారుణమా.. ఏకంగా 10 మందితో కలిసి..

కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించమని గట్టిగా అడిగినందుకు ఒక వ్యక్తి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *