అమ్మకానికి ప్రముఖ బ్యాంకు.. ఎస్‌బీఐ వాటా విక్రయం.. ఏకంగా రూ. 18 వేల కోట్లు!

SBI Yes Bank Stake Sale: భారత్‌లోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన.. యెస్ బ్యాంకులో మెజార్టీ వాటా చేతులో మారబోతోందని తెలుస్తోంది. ఇక దీంట్లో మెజార్టీ వాటా కొనేందుకు జపాన్‌కు చెందిన సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (SMBC) ఆసక్తి చూపిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. SMBC గ్లోబల్ సీఈఓ అకిహిరో ఫుకుటోమీ.. ఈ వారంలో భారత పర్యటనలో భాగంగానే యెస్ బ్యాంక్‌లో వాటా కొనుగోలుకు సంబంధించి చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ ట్రాన్సాక్షన్ (డీల్) కోసం ఫుకుటోమీ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఎస్బీఐ అధికారులతో భేటీ కాబోతున్నారని సమాచారం.

యెస్ బ్యాంకులో వాటాలు కొనుగోలు చేయాలని ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు చూస్తున్నాయి. యెస్ బ్యాంకులో దాదాపు 51 శాతం వాటాను దాదాపుగా 5 బిలియన్ డాలర్లకు ఇది భారత కరెన్సీలో రూ. 42 వేల కోట్లకు కొనుగోలు చేయాలని ఎస్‌ఎంబీసీ భావిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ఈ క్రమంలో ఇలాంటి వార్తలు వస్తుండగా.. ఎస్‌బీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాంకుకు దేశంలోని పలు బ్యాంకుల్లో వాటాలు ఉన్నాయి. ఇక యెస్ బ్యాంకులో కూడా 24 శాతం వాటా ఎస్బీఐకి ఉంది. ఇక దీని విలువను 184.2 బిలియన్ రూపాయలు లేదా 2.2 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టింది. భారత కరెన్సీలో ఇది రూ .18 వేల కోట్లకుపైనే. ఇప్పుడు ఈ వాటా మొత్తాన్ని ఎస్బీఐ విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మార్చి వరకు డెడ్‌లైన్‌గా పెట్టుకుందని తెలిసింది.
ముఖ్యంగా యెస్ బ్యాంకులో మెజార్టీ వాటా (51 శాతం) కొనేందుకు సుమిటొమో మిత్సుయ్ సహా దుబాయ్ ఆధారిత ఎమిరేట్స్ NBD చాలా ముందంజలో ఉన్నాయని ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తులు వెల్లడించారు.

సుమిటొమో మిత్సుయ్ అనేది.. జపాన్‌లోనే రెండో అతిపెద్ద బ్యాంకు అయిన సుమిటొమో మిత్సుయ్ ఫినాన్షియల్ గ్రూప్ అనుబంధ సంస్థ. ఈ రెండూ వాటా కొనుగోలుకు ఉత్సుకతతో చూస్తున్నాయని.. దీనికి ఆర్బీఐ కూడా ఇప్పటికే మౌఖిక ఆమోదం తెలిపిందని.. ఒప్పందం ఖరారు కావాల్సి ఉందన్నట్లుగా తెలుస్తోంది. యెస్ బ్యాంకులో ఎస్బీఐకి 24 శాతం వాటా ఉండగా.. ఇతర ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వంటి మొత్తం మరో 11 బ్యాంకులకు కలిపి 9.74 శాతం వాటా ఉంది. ఇప్పటివరకు ఎస్బీఐ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఆర్థిక సంవత్సరం చివర్లోగా విక్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

About amaravatinews

Check Also

బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి చౌకైన ప్లాన్‌.. 6 నెలల వ్యాలిడిటీ.. 3600జీబీ డేటా

BSNL: ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ BSNL అత్యంత ప్రజాదరణ పొందిన టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటి. అది అందిస్తున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *