FD Rates: ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల పెట్టుబడి మార్గాలు ఉన్నప్పటికీ రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడని వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు (Fixed Deposits) మొదటి ఛాయిస్‌గా ఉన్నాయి. ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎంచుకుంటున్నారు. ఇందులో గ్యారెంటీ రిటర్న్స్, జనరల్ కస్టమర్లతో పోలిస్తే అదనపు వడ్డీ రేట్లు, లిక్విడిటీ, పెట్టుబడి ప్రాసెస్ సులభంగా ఉండడం వంటివి ఇందుకు కారణమవుతున్నాయి. అలాగే పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితులు, మార్కెట్ ఒడుదొడుకుల నేపథ్యంలోనే చాలా మంది సీనియర్లు మార్కెట్ లింక్డ్ పెట్టుబడులను దూరం పెడుతున్నారు. తమ రిటైర్మెంట్ కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లనే ఎంచుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ ఆగస్టు నెలలో చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచాయి. సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్‌బీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ వంటి దేశంలోని 40 పెద్ద బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించాయి. ఈ క్రమంలో ఈ ఆగస్టు నెలలో సీనియర్ సిటిజన్లకు గరిష్ఠ వడ్డీ రేట్లు కల్పిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు 9.5 శాతం మేర వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. అయితే, ఈ వడ్డీ రేట్లు అనేవి ఎంచుకునే కాల వ్యవధి బట్టి మారుతుంటాయని గుర్తుంచుకోవాలి. కొన్ని బ్యాంకులు ప్రత్యేక టెన్యూర్ ద్వారా అధిక వడ్డీ రేట్లు కల్పిస్తున్నాయి.
అధిక వడ్డీ రేట్లు కల్పిస్తున్న బ్యాంకుల లిస్ట్ ఇదే..
- ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 18 నెలల టెన్యూర్ గల ఎఫ్‌డీ స్కీమ్ ద్వారా 8.5 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
- ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 444 రోజుల స్పెషల్ స్కీమ్ ద్వారా 9 శాతం వడ్డీ ఇస్తోంది.
- ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2-3 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్లపై 8.75 శాతం వడ్డీ ఇస్తోంది.
- జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 365 రోజుల నుంచి 1095 రోజుల కాల వ్యవధిగల డిపాజిట్లపై 8.75 శాతం వడ్డీ అందిస్తోంది.
- నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 546 రోజుల నుంచి 1111 రోజుల టెన్యూర్ డిపాజిట్లకు గరిష్ఠంగా 9.5 శాతం వడ్డీ అందిస్తోంది.
- యూనిటీ స్మాల్ ఫైనాన్స బ్యాంకులో 1001 స్కీమ్స్ ద్వారా సైతం 9.5 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
- ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 1500 రోజుల డిపాజిట్లపై 9.1 శాతం వడ్డీ అందిస్తోంది.
- సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 2-3 ఏళ్ల డిపాజిట్లకు 9.1 శాతం వడ్డీ ఉంది.
- ఇక ఎస్‌బీఐలో 444 రోజుల స్కీమ్ ద్వారా 7.75 శాతం వడ్డీ ఇస్తుండగా.. పీఎన్‌బీఓలో400 రోజులకు 7.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 55 నెలల స్కీమ్ ద్వారా 7.9 శాతం వడ్డీ ఇస్తోంది. యాక్సిస్ బ్యాంకులో 7.75 శాతం, ఐసీఐసీఐ బ్యాంకులో 7.8 శాతం గరిష్ఠ వడ్డీ రేట్లు ఉన్నాయి.