ఏపీలో వెయిటింగ్‌లోని ఐపీఎస్‌లకు మెమోలు.. ఆ కేసులు నీరుగార్చేలా, నిఘా విభాగం సంచలనాలు

ఏపీలో వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు డీజీపీ మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎస్‌లకు మెమోలు జారీ వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇటీవల విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా కొందరు ఐపీఎస్‌లు కుట్ర చేసినట్లు రాష్ట్ర ఇంటిలిజెన్స్ (నిఘా) విభాగం గుర్తించిందట. వివిధ కేసుల్లో జరుగుతున్న అంతర్గత విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు సాగించినట్లు డీజీపీ కార్యాలయం గుర్తించారట. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక అందజేయడంతో.. వెంటనే డీజీపీ కార్యాలయం అలర్ట్ అయ్యింది. వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు మెమోలు జారీ చేసిందట.

కొత్త ప్రభుత్వం విచారణకు ఆదేశించిన కేసుల్లో.. తమ పేర్లతో పాటు వైఎస్సార్‌సీపీ పెద్దల ప్రమేయాన్ని తక్కువ చేసి చూపేలా దర్యాప్తు చేయాలని.. ఆయా కేసులపై విచారణ చేస్తున్న అధికారులు, సిబ్బందికి వెయిటింగ్‌లో ఉన్న కొందరు ఐపీఎస్‌లు సూచనలు చేసినట్లు ఇంటిలిజెన్స్ గుర్తించనట్లు తెలుస్తోంది. ఈ కేసుల్ని తూతూ మంత్రంగా విచారణ ముగించాలని వెయింటింగ్‌లో ఉన్న కొందరు ఐపీఎస్‌లు సూచించినట్లు సమాచారం. వెయిటింగ్‌లో ఉన్న కొందరు ఐపీఎస్‌ల తీరుతో ప్రభుత్వ పెద్దలు కూడా షాకయ్యారట.
వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లు కొందరు ఇప్పటికీ వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా పనిచేస్తున్నట్లు గుర్తించారట. ఈ కేసుల దర్యాప్తునకు ఆటంకం కలిగించే ప్రయత్నాలను కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందట. అందుకే వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌ అధికారులు రోజూ వచ్చి హెడ్‌ క్వార్టర్స్‌లో సంతకాలు చేసి వెళ్లాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారట.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేసి వెయిటింగ్‌లో ఉంచింది. వీరంతా డీజీపీ కార్యాలయానికి రావడం లేదని.. ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో కూడా సమచారం ఇవ్వడం లేదు. తాజా పరిణమాలను డీజీపీ సీరియస్‌గా తీసుకున్నారు.. మొత్తం 16 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు రోజూ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది. ఈ అధికారులంతా రోజూ ఉదయం 10 గంటలకు డీజీపీ కార్యాలయానికి వెళ్లి అక్కడ అటెండెన్స్ రిజస్టర్‌లో సంతకాలు చేయాలని ఆదేశించారరు. ప్రతి ఒక్కరూ పనిగంటలు ముగిసేవరకూ కార్యాలయంలోనే ఉండాలని.. ఆ తర్వాత సంతకం చేశాకే మళ్లీ బయటకు వెళ్లాలని సూచించారు. నిబంధనల ప్రకారం పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ దాటి వెళ్లకూడదన్నారు.

డీజీపీ కార్యాలయం మెమో జారీ చేసిన ఐపీఎస్ అధికారుల్లో.. పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, పీవీ సునీల్‌కుమార్, ఎన్‌.సంజయ్, కాంతి రాణా తాతా, జి.పాలరాజు, కొల్లి రఘురామ్‌రెడ్డి, ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి, సీహెచ్‌.విజయరావు, విశాల్‌ గున్నీ, కేకేఎన్‌ అన్బురాజన్, వై.రవిశంకర్‌రెడ్డి, వై.రిషాంత్‌రెడ్డి, కె.రఘువీరారెడ్డి, పి.పరమేశ్వర్‌రెడ్డి, పి.జాషువ, కృష్ణకాంత్‌ పటేల్‌లు ఉన్నారు.

About amaravatinews

Check Also

ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు జమ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గత ఐదేళ్లుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *