పోస్టాఫీస్ స్కీమ్స్.. కేంద్రం హామీతో బంపర్ రిటర్న్స్.. దేంట్లో లేటెస్ట్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?

PPF Calculator: సంపద సృష్టించుకునేందుకు చిన్న పెట్టుబడిదారులకు ఎన్నో పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు.. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్లు, మ్యూచువల్ ఫండ్లు ఇంకా బాండ్స్ ఇలా చాలానే ఉంటాయి. ఇంకా రిస్క్ లేని పెట్టుబడుల విషయానికి వస్తే స్థిర ఆదాయం వచ్చే డెట్ మ్యూచువల్ ఫండ్లు, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్స్ ఇంకా పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ గురించి చెప్పుకోవాలి. చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టేందుకు,, దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ సంపాదించుకునేందుకు.. గ్యారెంటీ రాబడి అందుకునేందుకు పోస్టాఫీస్ పథకాలు బెస్ట్ ఆప్షన్‌గా ఉంటాయి. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం కూడా ఈజీనే. మార్కెట్ పరిస్థితులతో ఎలాంటి సంబంధం లేకుండా ఇక్కడ రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు మనం పోస్టాఫీస్ స్కీమ్స్ ఏమేం ఉన్నాయో తెలుసుకుందాం. వడ్డీ రేట్లు దేంట్లో ఎలా ఉన్నాయనేది చూద్దాం.

పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్- దీంట్లో కనీసం రూ. 500 తో అకౌంట్ తెరవొచ్చు. వడ్డీ రేటు 4 శాతంగా ఉంది. గరిష్టంగా ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. పరిమితి లేదు. రూ. 10 వేల వరకు వడ్డీ టాక్స్ ఫ్రీ.

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్- దీంట్లో ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల టెన్యూర్‌తో ఉన్నాయి. కనీసం రూ. 1000 డిపాజిట్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ త్రైమాసిక ప్రాతిపదికన లెక్కించి.. వార్షిక ప్రాతిపదికన జమ చేస్తారు. దీంట్లో ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌పై సెక్షన్ 80c కింద గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు టాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. వడ్డీ రేట్లు వరుసగా 6.9 శాతం, 7 శాతం, 7.10 శాతం, 7.50 శాతంగా ఉంది. ఇక పోస్టాఫీస్ ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.7 శాతంగా ఉంది.

సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ అకౌంట్- ఇక్కడ కనిష్టంగా రూ. 1000, గరిష్టంగా రూ. 30 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు. దీంట్లో 8.20 శాతం వడ్డీ రేటు ఉంది. దీంట్లో కూడా సెక్షన్ 80c పన్ను ప్రయోజనాలు పొందొచ్చు.

మంత్‌లీ ఇన్‌కం స్కీమ్ అకౌంట్- ఈ పథకంలో కూడా కనీసం రూ. 1000 డిపాజిట్‌తో చేరొచ్చు. గరిష్టంగా సింగిల్ అకౌంట్లో రూ. 9 లక్షల వరకు, జాయింట్ అకౌంట్ కింద రూ. 15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. దీంట్లో వడ్డీ రేటు 7.40 శాతంగా ఉంది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్- ఇక్కడ కూడా కనీసం రూ. 1000 పెట్టుబడి పెట్టొచ్చు. ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. ఇక్కడ 7.70 శాతం వడ్డీ రేటు ఉండగా.. దీంట్లో కూడా పన్ను మినహాయింపు పొందొచ్చు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)- దీంట్లో వడ్డీ రేటు 7.10 శాతంగా ఉన్నప్పటికీ.. పోస్టాఫీస్ పథకాల్లో అత్యంత డిమాండ్ ఉందని చెప్పొచ్చు. ఏటా కనీసం రూ. 500 డిపాజిట్ చేయొచ్చు. గరిష్టంగా రూ. 1.50 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టొచ్చు. వరుసగా 15 సంవత్సరాలు డబ్బులు కట్టాలి. తర్వాత ఐదేళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు. ఇక్కడ ప్రధాన బెనిఫిట్.. పెట్టుబడి, వడ్డీ రాబడి, మెచ్యూరిటీ రిటర్న్స్‌పై ఎలాంటి టాక్స్ ఉండదు. మళ్లీ సెక్షన్ 80c కింద పన్ను ప్రయోజనాలు పొందొచ్చు.

కిసాన్ వికాస్ పత్ర- ఇక్కడ 7.50 శాతం వడ్డీ రేటు ఉంది. సరిగ్గా 115 నెలల్లో మీ పెట్టుబడి డబుల్ అవుతుంది. కనీసం రూ. 1000 తో అకౌంట్ తెరవొచ్చు. సింగిల్ అకౌంట్ లేదా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ తెరవొచ్చు.

సుకన్య సమృద్ధి యోజన- ఇది కేవలం ఆడపిల్లల కోసం ఉద్దేశించిన స్కీమ్. దీంట్లో కూడా 8.20 శాతం వడ్డీ రేటు ఉంది. ఏటా కనీసం రూ. 250 లేదా గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. పాప పదేళ్ల లోపే అకౌంట్లో చేరాలి. వరుసగా 15 సంవత్సరాలు డబ్బులు కట్టాలి. అకౌంట్ తెరిచిన 21 ఏళ్లకు చేతికి డబ్బులు అందుతాయి. ఇక్కడ కూడా పన్ను ప్రయోజనాలు పొందొచ్చు.

About amaravatinews

Check Also

PF ఖాతా ఉన్నవారికి అలర్ట్.. యాక్టివ్ UAN లేకుంటే ఆ సేవలు బంద్.. చెక్ చేసుకోండి!

PF Account: ఎప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సంస్థ అక్టోబర్ 1, 2014 నుంచి యూనివర్సల్ అకౌంట్ నంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *