తెలుగు ప్రజలకు అలర్ట్.. భారీగా రైళ్లు రద్దు చేశారు..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమైన గమనిక.. భారీ వర్షాలు, వరదల కారణంగా రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడ డివిజన్‌లో రైల్వే ట్రాక్స్ దెబ్బ తిన్నాయి. ఈ కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడ డివిజన్లో రాయనపాడు వద్ద రైల్వే ట్రాక్స్ పూర్తిగా దెబ్బ తిన్నాయి. దీంతో పలు రైళ్లను రద్దు చేశారు. తాజాగా గోదావరి ఎక్స్‌ప్రెస్‌ సహా 19 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కొన్ని రైళ్లు దారి మళ్లించగా.. మరికొన్ని రీ షెడ్యూల్ చేశారు.

విశాఖ-హైదరాబాద్‌ గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12727), హైదరాబాద్‌-విశాఖ గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12728), విశాఖ-సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (20708), విశాఖ-లోకమాన్య తిలక్‌ టెర్మినల్ (ఎల్‌టీటీ ఎక్స్‌ ప్రెస్‌) (18519), విశాఖ-గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ (127739), సికింద్రాబాద్‌-విశాఖ గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ (12740), విశాఖ-సికింద్రాబాద్‌ దురంతో ఎక్స్‌ప్రెస్‌ (22203), విశాఖ-సికింద్రాబాద్‌ ఏసీ ఎక్స్‌ప్రెస్‌ (12783), నాందేడు- విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (20812), మచిలీపట్నం-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17219), విశాఖ-మహబూబనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (12861), హైదరాబాద్‌-షాలిమార్‌ ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (18046), సికింద్రాబాద్‌-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ ప్రెస్‌ (12704), మహబూబ్‌నగర్‌-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (12862)‌లు ఉన్నాయి.

హౌరా-సికింద్రాబాద్‌ ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్‌ (12703), టాటానగర్‌-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌ (18189), షాలిమార్‌-ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12841), విశాఖ-గుంటూరు ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ (22701), భువనేశ్వర్‌-బెంగుళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ (18463), భువనేశ్వర్‌- ముంబయి కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (11020), విశాఖ-ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌ (22869), విశాఖ-తిరుపతి ప్రత్యేక రైలు (08583), విశాఖ-తిరుపతి/కడప తిరుమల ఎక్స్‌ప్రెస్‌(17488), విశాఖ-తిరుపతి డబల్‌ డెక్కర్‌ (22707), విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ (12805), మైసూరు-హౌరా ఎక్స్‌ప్రెస్‌ (22818), పూరి-చెన్నై సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌ (22859), పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ (17479), హౌరా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ (12863), హౌరా-పాండిచ్చేరి ఎక్స్‌ప్రెస్‌ (12867), హౌరా-చెన్నై సెంట్రల్‌ మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12839), షాలిమార్‌-తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్‌ (22642), హటియా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ (12835)లను రద్దుచేశారు. విశాఖ నుంచి విజయవాడ బయలుదేరిన రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను (12717) నూజివీడు స్టేషన్‌లో, విశాఖ నుంచి తిరుపతి/ కడపకు బయలుదేరిన తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను (17488) సామర్లకోట వద్ద నిలిపివేశారు. విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ను (17220) ఇవాళ రద్దు చేశారు.

విజయవాడ-విశాఖ రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను (12718) ఈనెల 2, 3 తేదీల్లో.. గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను (12739) ఈనెల 2 నుంచి 5వ తేదీ వరకు, విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను (12740) ఈనెల 3 నుంచి 6వ తేదీ వరకు, గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌ను (17243) ఈనెల 2 నుంచి 5వ తేదీ వరకు, రాయగడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ను (17244) ఈనెల 3 నుంచి 6వ తేదీ వరకు రద్దు చేశారు.

ఇవాళ మచిలీపట్నం- విశాఖపట్టణం మధ్య నడిచే 17219 రైలు.. ధర్మవరం- మచిలీపట్నం (17247), లింగంపల్లి-నరసాపురం (17256), ధర్మవరం-నరసాపురం (17248), ఎస్ఎమ్‌విటి బెంగళూరు- కాకినాడ టౌన్ (17209) రద్దు చేశారు. విజయవాడ- గుంటూరు (07783), గుంటూరు- మాచర్ల (07779), మాచర్ల-నడికుడి (07580), నడికుడి-మాచర్ల (07579), మాచర్ల- గుంటూరు (07780), గుంటూరు-విజయవాడ (07788), కాచిగూడ-మిర్యాలగూడ (07276), మిర్యాలగూడ-నడికుడి (07277) మధ్య రైళ్లను సోమవారం, మంగళవారం రద్దు చేశారు. నడికుడి- మిర్యాలగూడ (07973), మిర్యాలగూడ- నడికుడి (07974 ) మధ్య రైలును సోమవారం నుంచి బుధవారం (సెప్టెంబర్ 4) వరకు రద్దు చేశారు.

మరోవైపు రైల్వే అధికారులు వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. రైలు సర్వీసుల పునరుద్ధరణ, భద్రతాపరమైన చర్యలకు సంబంధించిన అంశాలపై ఫోకస్ పెట్టారు. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేస్టేషన్లలో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటుచేశారు. విశాఖ 0891-2746330, 0891-2744619; విజయనగరం 8712641260, 08922-221202; శ్రీకాకుళం రోడ్డు 08942-286213, 08942-286245 సంప్రదించాలి. ఆదివారం, సోమవారం కలిపి మొత్తం 80 రైళ్లు రద్దు చేయగా, మరో 48 రైళ్లను దారి మళ్లించారు. హైదరాబాద్‌- విజయవాడ రూట్‌లోనే అత్యధిక రైళ్లు రద్దయ్యాయి. ఈ రైళ్ల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు.

About amaravatinews

Check Also

కార్తీక పౌర్ణమి రోజున ఈ రెమెడీస్ చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదల వర్షం కురుస్తుంది..

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కార్తీక పూర్ణిమ రోజున గంగాస్నానం చేయడం విశేషంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *