అల్లూరి జిల్లా: 18మంది విద్యార్థినుల జుట్టు కత్తిరించిన మహిళా అధికారి.. ఆ చిన్న కారణానికే ఇలా

అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం జరిగింది. ఉదయం ప్రతిజ్ఞకు హాజరుకాలేదన్న కారణంతో విద్యార్థినుల జుత్తును ప్రత్యేక అధికారిణి కత్తిరించారు. జి.మాడుగులలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఉంది. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి రోజు అక్కడ నీరు అందుబాటులో లేదు. బైపీసీ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు కొందరు ఉదయం ప్రతిజ్ఞకు ఆలస్యంగా వచ్చారు. వీరిలో 23 మంది విద్యార్థినులు రాలేదని ప్రత్యేక అధికారిణి సాయిప్రసన్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విద్యార్థినుల్లో నలుగురిపై చేయి చేసుకున్నారు సాయిప్రసన్న. అక్కడితో ఆగకుండా.. విద్యార్థినులను ఎండలో నిల్చోబెట్టడంతో ఒకరు సొమ్మసిల్లి పడిపోయారు.ఆ తర్వాత మధ్యాహ్న భోజన విరామ సమయంలో 18 మంది విద్యార్థినుల జుత్తును కొద్ది కొద్దిగా అధికారిణి సాయిప్రసన్న కత్తిరించారు. ఈ విషయాన్ని బాధిత విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ నెల 15న విద్యార్థినులు ప్రతిజ్ఞకు, తరగతులకు కూడా రాలేదని ప్రత్యేక అధికారిణి సాయిప్రసన్న చెబుతున్నారు. వీకె ఒంటి గంట వరకు జుత్తు విరబోసుకొని తిరుగుతురన్నారు.. అందుకే వారిలో క్రమశిక్షణ అలవర్చేందుకు కొందరి జుత్తును కొద్దిగా కత్తిరించినట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు ఎంఈవో బాబూరావు పడాల్‌. క్రమశిక్షణ అలవాటు చేసేందుకు జుట్టు కత్తిరించాల్సిన అవసరం ఏంటని.. మందలిస్తే సరిపోయేదంటున్నారు.

About amaravatinews

Check Also

 శ్రీవారి భక్తులకు అలెర్ట్.. 7 రోజుల పాటు ఈ సేవలు రద్దు..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అలిపిరిలో జరిగే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *