భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం.. 27 ఏళ్ల తర్వాత సిరీస్‌ కోల్పోయిన భారత్‌

టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, కెప్టెన్‌ రోహిత్ శర్మ కాంబోలో ఆడిన తొలి వన్డే సిరీస్‌ను భారత్‌ కోల్పోయింది. శ్రీలంకతో జరిగిన ఈ వన్డే సిరీస్‌లో 0-2తో భారత్‌ ఓడిపోయింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో శ్రీలంక 110 రన్స్ తేడాతో టీమిండియాను ఓడించింది. బ్యాటర్ల వైఫల్యంతో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ భారత్‌ గెలవలేకపోయింది. అయితే ఈ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లో 248/7 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఆవిష్క ఫెర్నాండో 102 బంతుల్లో 96 రన్స్‌ స్కోరు చేశాడు. కుశాల్‌ మెండీస్ సైతం హాఫ్‌ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్‌తో వన్డేల్లో భారత్‌ తరఫున డెబ్యూ చేసిన రియాన్ పరాగ్.. భారత బౌలర్లలో అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి శుభారంభం ఇచ్చాడు. 20 బంతుల్లోనే 35 రన్స్‌ చేశాడు. అతడు ఔట్ అయ్యాక.. భారత బ్యాటర్లు మరోసారి విఫలమయ్యారు. శ్రీలంక స్పిన్నర్లకు దాసోహమంటూ.. వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో భారత్‌ 26.1 ఓవర్లలోనే 138 పరుగులకు కుప్పకూలింది. దీంతో సిరీస్‌ను 0-2తో కోల్పోయింది.

ఈ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. వన్డే సిరీస్‌లో తొలి వన్డే డ్రాకాగా.. రెండో వన్డే, మూడో వన్డేలో శ్రీలంక గెలుపొంది. ఈ ఫలితంతో భారత్.. 27 ఏళ్ల తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్‌ను కోల్పోయింది.

About amaravatinews

Check Also

297 శాతం పెరిగిన ప్రపంచకప్ ప్రైజ్ మనీ.. విజేతకు ఎంత వస్తాయో తెలిస్తే షాకే..

మహిళల ప్రపంచ కప్ 2025 కోసం రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీ ప్రకటించారు. ఐసీసీ చీఫ్ జై షా ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *