దశ తిప్పిన ఐపీఓ.. లిస్టింగ్‌తో చేతికి రూ. 2.75 లక్షలు.. ఒక్కరోజే 100 శాతం పెరిగిన షేరు!

స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేవారు రిస్క్ ఉంటుందని తెలుసుకోవాలి. అయినప్పటికీ ఇటీవలి కాలంలో ఇందులో లాభాలపై ఆశతో కొత్తగా ఎక్కువ మంది చేరుతున్నారని చెప్పొచ్చు. అయితే వీరు ముందుగా మార్కెట్లపై మంచి అవగాహన పెంపొందించుకోవాలి. ఇంకా ఆర్థిక నిపుణుల సలహాతో సరైన స్టాక్ ఎంచుకోవాలి. కంపెనీల పనితీరు, ప్రకటనలు, ఫలితాలు, పెట్టుబడి వ్యూహాలు ఇలా అన్నీ గమనిస్తూ సరైన సమయంలో సరైన స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే లాంగ్ టర్మ్‌లో మంచి రిటర్న్స్ వస్తుంటాయి. ఇక ఐపీఓలు మాత్రం లిస్టింగ్‌తోనే మీ సంపదను ఎన్నో రెట్లు పెంచుతుంటాయి. ఇలాంటి ఒక ఐపీఓనే ఇప్పుడు మంచి లాభాల్ని ఇచ్చింది.

ఇదే ట్రామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. గురువారం రోజు ఇది ఇండియన్ స్టాక్ మార్కెట్ NSE SME ఎక్స్చేంజీలో లిస్టయింది. ఇష్యూ ధర రూ. 115 తో చూస్తే ఏకంగా 90 శాతం ప్రీమియం నమోదు చేసిన షేరు రూ. 218.50 వద్ద ఎంట్రీ ఇచ్చింది. అక్కడితో ఆగకుండా మరో 5 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టి రూ. 229.40 వద్దకు చేరింది. ఇది చూస్తే ఏకంగా 99.48 శాతం ఎక్కువ అని చెప్పొచ్చు. అంటే ఇష్యూ ధరతో పోలిస్తే దాదాపు రెట్టింపు లాభం అందించింది. తొలిరోజే 100 శాతం పెరిగిందన్నమాట. ఈ క్రమంలోనే కంపెనీ మార్కెట్ విలువ రూ. 148 కోట్లుగా ఉంది.

గ్రే మార్కెట్ ప్రీమియంకు అనుగుణంగానే ఇది లిస్టయింది. ఈ స్టాక్ జీఎంపీ దాదాపు 134 శాతంగా ఉండగా.. 100 శాతం నమోదు చేసింది. NSE ప్రైస్ కంట్రోల్ క్యాప్ కారణంగానే ఇలా 90 శాతం ప్రీమియంతోనే లిస్టింగ్ అయింది. ఇక ఇందులో కనీసం ఒక్క లాట్ కింద 1200 షేర్లు కొనుగోలు చేయాలి. ఈ లెక్కన ఇష్యూ ధర రూ. 115 తో చూస్తే కనీస పెట్టుబడి రూ. 115X1200= రూ. 1.38 లక్షలు కావాలి. ఇక లిస్టింగ్‌తో చూస్తే చేతికి రూ. 262,200 వచ్చింది. మళ్లీ అప్పర్ సర్క్యూట్‌తో చూస్తే రూ. 275,280 వచ్చింది.

ఈ ఐపీఓ విషయానికి వస్తే ఇది జులై 25న ప్రారంభం కాగా.. సబ్‌స్క్రిప్షన్ జులై 29న ముగిసింది. జులై 30న షేర్ల అలాట్‌మెంట్ పూర్తయింది. ఇక ఆగస్ట్ 1న స్టాక్ మార్కెట్లో లిస్టయింది. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ. 100-రూ. 115 గా నిర్ణయించింది. చివరకు రూ .115 ఖరారైంది. మొత్తం ఫ్రెష్ ఇష్యూ ద్వారా 27.28 లక్షల ఈక్విటీ షేర్లు జారీ చేసింది. బిడ్డింగ్ పీరియడ్‌లో ఇన్వెస్టర్ల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ లభించిందని చెప్పొచ్చు. మొత్తం 18.14 లక్షల షేర్లకు గానూ ఏకంగా 83.28 కోట్ల ఈక్విటీ షేర్లకు బిడ్స్ వచ్చాయి. అత్యధికంగా రిటైల్ కేటగిరీలో 483.14 రెట్ల మేర రెస్పాన్స్ లభించింది. ఈ కంపెనీ విషయానికి వస్తే ఇది సోలార్ ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ కంపెనీ.

About amaravatinews

Check Also

బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి చౌకైన ప్లాన్‌.. 6 నెలల వ్యాలిడిటీ.. 3600జీబీ డేటా

BSNL: ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ BSNL అత్యంత ప్రజాదరణ పొందిన టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటి. అది అందిస్తున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *