- లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- దేశీయంగా కలిసొచ్చిన అమెరికా ఫెడ్ నిర్ణయం
- రూపాయి విలువ 83.54 దగ్గర ఫ్లాట్‌గా ముగిసింది
- అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్లకు కలిసొస్తున్నాయి. వడ్డీ రేట్లపై ఫెడ్ నిర్ణయంతో బుధవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. అలాగే తాజా రాజకీయ పరిణామాలు కూడా సానుకూలంగానే ఉన్నాయి. దీంతో వరుసగా రెండో రోజు సూచీలు ఉత్సాహంగా ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 204 పాయింట్లు లాభాపడి 76, 810 దగ్గర ముగియగా.. నిఫ్టీ 75 పాయింట్లు లాభపడి 23, 398 దగ్గర ముగిసింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 83.54 దగ్గర ఫ్లాట్‌గా ముగిసింది.
- నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, డివిస్ ల్యాబ్స్, ఎం అండ్ ఎం మరియు టైటాన్ కంపెనీ టాప్ గెయినర్స్‌గా ఉండగా… హెచ్‌యుఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్ మరియు భారతీ ఎయిర్‌టెల్ నష్టపోయాయి.
Check Also
Odisha: గిరిజన మహిళను కొట్టి.. బలవంతంగా మలాన్ని తినిపించి.. అమానుషం
ఓ గిరిజన మహిళపై దాడిచేసి.. ఆమెతో బలవంతంగా మానవ మలం తినిపించిన అత్యంత హేయమైన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. బొలన్‌గిర్ …